కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది! | Welcome to jail, Woman, is arrested | Sakshi
Sakshi News home page

కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది!

Published Mon, Jul 25 2016 12:29 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది! - Sakshi

కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది!

నలుగురికి తమ ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఇంటిముందుభాగంలో రకరకాల అలంకారాలు చేస్తారు. కానీ, అలాంటి అందమైన అలంకారాలను కూడా దొంగలించే దొంగలు కూడా ఉంటారు. తాజాగా అమెరికాలో ఓ 30 ఏళ్ల మహిళ ఇలాంటి కక్కూర్తి పనే చేసింది. ఓ ఇంటి ముందుభాగంలో ఉన్న 'వెల్ కమ్' బోర్డును, అమెరికా జెండా వస్త్రంతో చేసిన పూలడిజైన్ ను దొంగలించింది.

తెలివిగా ఎవరికంట పడకుండా వాటిని దొంగిలించానని ఆమె మురిసిపోయింది. కానీ, నిఘా కోసం పెట్టిన రహస్య కెమెరాల్లో ఆమె అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో జరిగింది. నిందితులరాని కార్లే విలియమ్స్ గా గుర్తించారు. ఆమె ఓ ఇంటి ముందున్న 'వెల్ కమ్' బోర్డును, పూల డిజైన్ ను దొంగలించడం.. సీసీకెమెరాల్లో రికార్డయింది. దీంతో నిందితురాలని గుర్తించిన పోలీసులు ఆమె చిల్లర దొంగతనానికి పాల్పడిందని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.

ఆమె ఇంట్లో నుంచి దొంగలించిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంటి ముందు ఆవరణలో ఉంచే పలు వస్తువులను ఆమె దొంగలించిందని పోలీసులు గుర్తించారు. ఎవరూలేని సమయం చూసి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం ఆమె అలవాటు అని పోలీసులు తెలిపారు. సీసీకెమెరా వీడియో ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి సహకరించిన సోషల మీడియా, మీడియాకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement