Harris County
-
అమెరికా తుపాకీ సంస్కృతికి నాలుగేళ్ల చిన్నారి బలి
హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను చూశారు. పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్‌చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. -
అమెరికాలో.. న్యాయ పీఠంపై తొలి సిక్కు మహిళ
ఆస్టిన్: భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించారు. హ్యారిస్ కౌంటీ(టెక్సాస్) జడ్జిగా ఆమె ప్రమాణం చేశారు. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 70వ దశకంలో తొలినాళ్లలో మోనికా సింగ్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం బెల్లయిరేలో నివాసం ఉంటున్నారు. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం టెక్సాస్‌లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో(లా నెంబర్ 4) ఆమె జడ్జిగా ప్రమాణం చేశారు. హ్యూస్టన్లోనే ట్రయల్ లాయర్‌గా 20 ఏళ్లపాటు పని చేసిన ఆమె.. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు, జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని సైతం వాదించారు. తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో మోనికా సింగ్ సిక్కు వర్గానికి ఇవి మరిచిపోలేవని క్షణాలని ఇండో-అమెరికన్ న్యాయమూర్తి రవి సందిల్ పేర్కొన్నారు. మోనికా సింగ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. టెక్సాస్‌కు జడ్జిగా ఎన్నికైక తొలి సౌత్ ఏషియా వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కు జనాభా ఉందని ఒక అంచనా.. అందులో 20వేల మంది హ్యూస్టన్‌లో ప్రాంతంలోనే స్థిరపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది!
నలుగురికి తమ ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఇంటిముందుభాగంలో రకరకాల అలంకారాలు చేస్తారు. కానీ, అలాంటి అందమైన అలంకారాలను కూడా దొంగలించే దొంగలు కూడా ఉంటారు. తాజాగా అమెరికాలో ఓ 30 ఏళ్ల మహిళ ఇలాంటి కక్కూర్తి పనే చేసింది. ఓ ఇంటి ముందుభాగంలో ఉన్న 'వెల్ కమ్' బోర్డును, అమెరికా జెండా వస్త్రంతో చేసిన పూలడిజైన్ ను దొంగలించింది. తెలివిగా ఎవరికంట పడకుండా వాటిని దొంగిలించానని ఆమె మురిసిపోయింది. కానీ, నిఘా కోసం పెట్టిన రహస్య కెమెరాల్లో ఆమె అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో జరిగింది. నిందితులరాని కార్లే విలియమ్స్ గా గుర్తించారు. ఆమె ఓ ఇంటి ముందున్న 'వెల్ కమ్' బోర్డును, పూల డిజైన్ ను దొంగలించడం.. సీసీకెమెరాల్లో రికార్డయింది. దీంతో నిందితురాలని గుర్తించిన పోలీసులు ఆమె చిల్లర దొంగతనానికి పాల్పడిందని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. ఆమె ఇంట్లో నుంచి దొంగలించిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంటి ముందు ఆవరణలో ఉంచే పలు వస్తువులను ఆమె దొంగలించిందని పోలీసులు గుర్తించారు. ఎవరూలేని సమయం చూసి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం ఆమె అలవాటు అని పోలీసులు తెలిపారు. సీసీకెమెరా వీడియో ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి సహకరించిన సోషల మీడియా, మీడియాకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. -
అమెరికాలో కాల్పులు
హూస్టన్: అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. హూస్టన్‌లోని హారిస్ కౌంటీలో గల ఓ ఇంటికి గురువారం ఫెడ్ఎక్స్ కొరియర్ కంపెనీ దుస్తులు వేసుకుని వచ్చిన ఓ దుండగుడు ఆ ఇంట్లోని నలుగురు పిల్లలను, వారి తల్లిదండ్రులను కాల్చిచంపాడు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని రాన్ లీ హస్కెల్(33)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడి భార్యకు, మృతులకు బంధుత్వం ఉందని, విడాకులకు సంబంధించిన వివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు(4, 14 ఏళ్లు), ఇద్దరు బాలికలు(7, 9 ఏళ్లు) ఉన్నారు.