సచివాలయ ఉద్యోగులకు ఘన స్వాగతం
సచివాలయ ఉద్యోగులకు ఘన స్వాగతం
Published Mon, Oct 3 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
నగరంపాలెం( గుంటూరు): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన విధులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. సికింద్రాబాద్–విజయవాడ రైలులో ఉదయం 10.35 గంటలకు వారంతా గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి గులబీ పూలతో స్వాగతం పలికారు. ‘రాజధానికి తరలివస్తున్న ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు స్వాగతం.. అవినీతి రహితమైన పరిపాలనను అందించాలని కోరుతున్నాం..’ అంటూ అవగాహన సంస్థ బ్యానర్లు ప్రదర్శించింది. సచివాలయ మహిళాlఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది బ్యానర్లు ప్రదర్శించుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయంకు వెళ్లేందుకు ఆర్టీసీ పది బస్సులను రైల్వేస్టేషన్ వద్ద సిద్ధంగా ఉంచింది. వారంతా ఆ బస్సుల్లో సచివాలయానికి చేరుకున్నారు. చిన్నచిన్న సమస్యలున్నా స్వంతరాష్ట్ర అభివద్ధి దష్ట్యా సర్దుకుపోయి పనిచేసుకుంటామని ఈ సందర్భంగా వారు విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement