
నగరానికి చేరుకున్న స్వరూపానంద సరస్వతి
విజయవాడ కల్చరల్: ఆది శంకరులు స్థాపించిన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి బుధవారం నగరానికి చేరుకున్నారు. ఆయనకు భక్తులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయ యాత్రలో భాగంగా గురువారం నుంచి నాలుగురోజులపాటు నగరంలో విడిదిచేయనున్నారు. ప్రతి రోజూ అనుగ్రహ భాషణ, చంద్రమౌళీశ్వరస్వామి పూజలు, భిక్షావందనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో మాగంటి సూర్యనారాయణ, మాచవరం హనమత్ దేవాలయం కార్యనిర్వహణ అధికారి నూతక్తి వెంకటసుబ్బారావు, మాగంటి సూర్యనారాయణ, సీతారామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిక్షావందనం వివరాలకు 7013585807లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.