
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
గన్నవరం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఉదయం 11.45 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు.
విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ ఆర్.రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి, నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ హరికిరణ్, ఆర్డీవో చెరుకూరి రంగయ్య, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం, డెప్యూటీ సీఎం హెలికాప్టర్‌లో సత్తెనపల్లి వెళ్లారు.