లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల
Published Sun, Mar 5 2017 10:32 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
కోరుకొండ : అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం – దత్తత దేవాలయమైన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నవరం దేవస్థానం పీఆర్‌ఓ తులారాము, ఏఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, సూపరింటెండెంట్ పీవీ రమణ, ఇన్‌చార్జ్ టీఎన్ రామ్‌జీ అన్నారు. ఆదివారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 12 వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త వీవీ రోహిత్, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ సారధ్యంలో జరుగుతుందన్నారు. అన్నవరం దేవస్థానం నిధులతో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుపుతామన్నారు. సుమారు రూ.14 లక్షలతో తీర్థం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి మెట్ల సమీపంలో అన్నవరం దేవస్థానం రూ.30 లక్షల నిధులతో భక్తులకు విశ్రాంతి గదులను నిర్మిస్తామన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నవరం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అర్జన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సారధ్యంలో డీఎస్పీ ఏవీఎల్. ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్సైలు బంధోబస్తు నిర్వహిస్తారన్నారు. కొండ దిగువున, కొండ పైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం 2010లో దత్తత తీసుకుందని, అప్పుడు రూ.మూడు లక్షల ఎఫ్‌డీఆర్‌తో దేవస్థానాన్ని దత్తత తీసుకున్నామని, ప్రస్తుతం రూ. 31 లక్షలు స్వామి వారి పేరున ఎఫ్‌డీఆర్ వేశామన్నారు.
Advertisement
Advertisement