
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్.. బుధవారం ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
గురువారం కూనవరం మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని వైఎస్ జగన్ సందర్శిస్తారు. అక్కడ కూడా ఆయన పోలవరం బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి గిరిజనుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసు కుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. అలాగే.. ఈ నెల 9న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.