కేసీఆర్‌కు గంగదేవిపల్లి స్వాగతం
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి
గ్రామజ్యోతి కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం
గీసుకొండ :సీఎం కేసీఆర్‌కు మండలంలోని గంగదేవిపల్లి స్వాగతం పలుకుతోంది. ప్రతీ గడప, కుటుంబం ఆయన రాకకోసం ఎదురు చూస్తోంది. తమ గ్రామానికి దేశవిదేశీయులు అనేకమంది వచ్చినా సీఎం కేసీఆర్ తొలిసారి ఇక్కడ పర్యటించడం వారిలో నూతనోత్తేజం నింపుతోంది. గ్రామజ్యోతి పథకాన్ని ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించనుండడంతో జిల్లానేకాదు.. రాష్ర్టం దృష్టి మొత్తం ఇక్కడే ఉంది.
గ్రామస్తులతో ముఖాముఖి
సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు గ్రామానికి చేరుతారు. ఆయనకు స్వాగ తం పలకడానికి సర్వం సిద్ధం చేశామని గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూ సం రాజమౌళి తెలిపారు. తొలుత సీఎం ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల అ నుభవాలు అడిగి తెలుసుకుంటారు. జెడ్పీ పాఠశాలలో మొక్కలు నాటుతా రు. గ్రామపంచాయతీ కార్యాలయం వ ద్ద గ్రామసభ చేపట్టి గంగదేవిపల్లి ఆదర్శాల గురించి గ్రామస్తులతో చర్చిస్తారు. ఒకవేళ వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో రేకులతో పెద్దకప్పు, వేదిక ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లలో అధికారులు
సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధాన శాఖల అధికారులు ఇక్కడే మకాం వేసి అవసరమైన చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ పాటిల్ ఆదివారం రాత్రి వరకూ ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు.
కట్టుదిట్టంగా భద్రత..
గంగదేవిపల్లిలో సీఎం సెక్యూరిటీ ఫో ర్స్ మకాం వేసింది. వీరే కాకుండా సు మారు వెయ్యి మంది పోలీసులను ని యమించారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఏసీపీ మహేందర్ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రా మం మీదుగా హెలికాప్టర్ చక్కర్లు కొ ట్టింది. అయితే సీఎం ఎలా వస్తారనే వి షయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.