
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు.
అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment