inaguarated
-
రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్
భారత్‌లో యాపిల్ రెండో స్టోర్ ఢిల్లీలోని యాపిల్ సాకేత్ (apple saket)ను సీఈవో టిక్‌కుక్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు కస్టమర్లు, నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ కస్టమర్లకు అభివాదం చేసి స్వాగతం పలికారు. పలువురిని పలకరించారు. కస్టమర్లు కూడా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! #WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w — ANI (@ANI) April 20, 2023 ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రెండు రోజుల ముందే తమ మొదటి స్టోర్‌ను స్టోర్‌ను యాపిల్ ప్రారంభించింది. ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ సాకేత్ స్టోర్ భారత్‌లో రెండవది. కాగా పరిమాణంలో ఢిల్లీ స్టోర్.. ముంబై స్టోర్ కంటే చిన్నది. స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్ -
ఆ దుర్మార్గులు కానిస్తరా అనుకున్నాం:సీఎం కేసీఆర్
-
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్
-
తెలంగాణ జన హృదయ సాగరం మల్లన్న సాగర్:సీఎం కేసీఆర్
-
దేశం దారితప్పి పోతోంది.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ‘దేశం దారి తప్పి పోతోంది, చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. తప్పకుండా, ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడు నాకిచ్చిన సర్వశక్తులు, సకల మేథో సంపత్తిని ఉపయోగిస్తా. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతా..’అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘మత కల్లోలాలను సహించకూడదు. అవి కేన్సర్‌లా విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడే తరిమికొట్టాలి. పిల్లలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు..’అని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జల హృదయ సాగరం ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జల హృదయ సాగరం.. తెలంగాణ జీవనాడి.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు. ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ «శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నా. గోదావరి నదిలో 50 డిగ్రీల ఎండలో ఇంజనీర్లు పడ్డ కష్టం వృథా కాలేదు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆసియాలో ఎక్కడా లేని విధంగా పునరావాసం కల్పించాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అధికారులు వెంటనే వారికి న్యాయం చేయాలి. మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో ఒక రోజు 58 వేల మంది కార్మికులు 14 రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. అక్కడి నుంచే మన రాష్ట్ర చీఫ్ జస్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరా. దాదాపు 600 పైచిలుకు కేసులు వేయగా అన్నీ కొట్టేశారు. ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేనివారు, కొన్ని రాజకీయాల పార్టీల వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు...’అని కేసీఆర్ అన్నారు. కరువు నుంచి కాపాడే కాళేశ్వరం ‘తెలంగాణలో పంటలు పండించే, కరువు రాకుండా కాపాడే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటది? అని ఉద్యమ సమయంలో నేను ప్రశ్నించా. ఉద్యమ వేడిని చల్లార్చడానికి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటోంది. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి..’అని కోరారు. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి ‘హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. తెలంగాణలో ఎక్కడకు పోయినా ఎకరా భూమి రూ.20 లక్షలకు పైగానే ఉండడంతో మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారితే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి 1.50 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు 580 వరకు శంషాబాద్‌లో దిగుతున్నాయి..’అని ముఖ్యమంత్రి తెలిపారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ ‘దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకుంది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌లోని మారుమూల పల్లెల్లో అంటు రోగాలు మాయం అయ్యాయి. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. అనేక రంగాల్లో బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం..’అని చెప్పారు. రూ.1,500 కోట్లతో పర్యాటకాభివృద్ధి ‘అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలి. ఇందుకు మంత్రి హరీశ్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ఏడాదిన్నరలో పూర్తి చేయాలి. హాలీవుడ్, హిందీ సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మధ్యలో దీవులు ఉన్నాయి. 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. ఔషధ మొక్కలు పెంచాలి. రిజర్వాయర్ వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరిగేషన్ కాంప్లెక్స్ నిర్మించాలి..’అని కేసీఆర్ ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా రాబోతోంది కాబట్టి రెండు నాలుగు వరసల రోడ్లు ఈ ప్రాజెక్టు వరకు వేయాలని సీఎం సూచించారు. మంత్రి హరీశ్ డైనమిక్ లీడర్ ‘రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు డైనమిక్ లీడర్. చురుకైన మంత్రి. ఆయనకు మంచి శక్తియుక్తులు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎంతో క్రమశిక్షణతో, కడుపు మోపు కట్టుకుని, 100కు 100 శాతం పూర్తి అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్‌తో ముందుకు సాగుతూ పనిచేస్తే అది ఈవేళ సాకారం అయింది..’అంటూ కేసీఆర్ అభినందించారు. ఐదు రిజర్వాయర్ల వద్ద పర్యాటకాభివృద్ధి పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌ను అదేశించారు. మల్లన్న జలాలతో అభిషేకం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, సభ అనంతరం సీఎం మల్లన్నసాగర్ నీటిని ఐదు బిందెల్లో తీసుకుని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికి వెళ్లారు. మల్లిఖార్జున స్వామికి మల్లన్న జలాలతో అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: AP: మిడిల్‌క్లాస్‌కి జాక్'ప్లాట్' -
సిద్ధిపేటలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్..
సాక్షి, సిద్ధిపేట: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో నాలుగు ఐటీ కంపెనీలు సిద్ధిపేట ఐటీ టవర్‌లో వారి సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్ ,ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ కంపనీలు పాల్గొన్నాయి. అదే విధంగా మన పట్టణ ప్రగతిలో మన గౌరవం దక్కేలా ముస్తాబాద్ సర్కిల్లో మోడల్ టాయిలెట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ ఛైర్మన్ పాలసాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్ ప్రవీణ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుడా వైస్ ఛైర్మన్ రమణాచారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రైతు వేదిక ప్రారంభం సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. రైతు వేదిక వద్ద గ్రామంలోని ప్రజలను కేసీఆర్ పలకరించారు. అదే విధంగా మిట్టపల్లి మహిళ గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పప్పు దినుసులను పరిశీలించారు. మెడికల్ కళాశాల ప్రారంభం సిద్ధిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంత్రి హరీశ్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అవరణలో రూ.225 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 960 పడకల ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సిద్ధిపేటలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్ కాలినడకన సందర్శించారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు, పలువురు నేతలు ఉన్నారు. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా ’రైతు వేదిక’లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ వరంగల్: విత్తు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకు కష్టాల సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ఇస్తోంది. రైతులను ఒకే వేదిక కిందకు తీసుకురావడంతోపాటు వారు అధిక రాబడి పొందడంలో సహాయ పడేందుకు నిర్మించిన రైతు వేదికలను నేడు కర్షకులకు అంకితం చేయనుంది. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 572.22 కోట్లు కేటాయించగా క్లస్టర్లవారీగా ప్రతిపాదించిన వాటి నిర్మాణ వ్యయాలను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు భరించాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేదికల నిర్మాణాలను అనుసంధానించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,536, పట్టణ ప్రాంతాల్లో 65 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా భూసేకరణ, తదితర కారణాలతో 63 చోట్ల రైతు వేదికలకు ఇంకా పునాది రాయి పడలేదు. మిగిలిన వాటిలో పూర్తయిన 2,476 రైతు వేదికలను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ అనివార్య కారణాలతో సాధ్యంకాలేదు. సకల సదుపాయాలతో.. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్ పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. వేదికల్లో మౌలిక సదుపాయాలైన కుర్చీలు, మైకులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొనేలా వేదికలను నిర్మించారు. క్లస్టర్ పరిధిలోని రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు సమావేశాలు అక్కడే నిర్వహించుకొనేలా నిర్మాణాలకు రూపకల్పన చేశారు. రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఈ వేదికల్లోనే నిర్వహించనున్నారు. రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ ఇదే ‘వేదిక’ కానుంది. దాతల చేయూత... రైతు వేదికల నిర్మాణంలో కర్షక లోకానికి దాతలు అండగా నిలిచారు. కొన్నిచోట్ల స్థలాలను, మరికొన్ని చోట్ల నిర్మాణ ఖర్చులను విరాళంగా ఇచ్చారు. 135 చోట్ల రైతు వేదికల నిర్మాణ స్థలాలను దానం చేయగా 24 చోట్ల వాటి నిర్మాణ వ్యయాన్ని దాతలు భరించారు. కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జనగామ జిల్లా కొడకండ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొడకండ్లకు చేరుకొని 12:10 గంటలకు రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12:20 నిమిషాలకు సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులను పరిశీలిస్తారు. కొడకండ్లలో దాదాపు 5 వేల మంది రైతులతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
-
విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయం
సాక్షి, విజయవాడ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. దసరా పర్వదినం సందర్భంగా సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన...దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకున్నాం. ప్రజలందరికీ మంచి జరగాలి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ దుర్గమ్మను దర్శించుకుని, కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నా. చదవండి: స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంది. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. దేశంలో అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ కూడా మాదే. పదవుల్లో ఉన్నా, లేకున్నా బీజేపీ నేతలు కుటుంబంలా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పని చేస్తాం. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా తరపున ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ ధియోధర్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, సుజనా చౌదరి, పార్టీ నేతలు మధుకర్ జీ, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, రావెల కిషోర్ బాబు, ఆదినారాయణరెడ్డి, గోకరాజు తదితరులు పాల్గొన్నారు. -
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో ఈ ఫ్లైఓవర్ ఒకటి. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్ వద్ద రూ. 26.45 కోట్లతో పూర్తి చేశారు. ఎస్సార్డీపీ ప్యాకేజీ-2లో మొత్తం 14 పనులుండగా, ఇప్పటికే ఐదు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్‌రోడ్ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. -
కాగ్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. -
ఆయుధాగారాన్ని ప్రారంభించిన ఇన్చార్జి డీఐజీ
ఆదిలాబాద్ (బెల్లంపల్లి): ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుధాగారాన్ని కరీంనగర్ ఇన్చార్జి డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. దీంతో పాటు ఏఆర్ డీఎస్పీ, సీఐ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు పాల్గొన్నారు.