Apple CEO Tim Cook Innaugrates India Second Retail Store In Delhi, Details Inside - Sakshi
Sakshi News home page

Apple Retail Store In Delhi: రెండో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్‌

Published Thu, Apr 20 2023 11:23 AM | Last Updated on Thu, Apr 20 2023 1:30 PM

Apple CEO Tim Cook innaugrates India second retail store in Delhi - Sakshi

భారత్‌లో యాపిల్‌ రెండో స్టోర్‌ ఢిల్లీలోని యాపిల్‌ సాకేత్‌ (apple saket)ను సీఈవో టిక్‌కుక్‌ గురువారం (ఏప్రిల్‌ 20) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు కస్టమర్లు, నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్‌ కస్టమర్లకు అభివాదం చేసి స్వాగతం పలికారు. పలువురిని పలకరించారు. కస్టమర్లు కూడా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ తమ మద్దతు తెలియజేశారు.

ఇదీ చదవండి: apple saket: యాపిల్‌ ఢిల్లీ స్టోర్‌ ఫస్ట్‌ లుక్‌.. అదిరిపోయింది!

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రెండు రోజుల ముందే తమ మొదటి స్టోర్‌ను స్టోర్‌ను యాపిల్‌ ప్రారంభించింది. ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్‌ సాకేత్‌ స్టోర్‌ భారత్‌లో రెండవది. కాగా పరిమాణంలో ఢిల్లీ స్టోర్‌.. ముంబై స్టోర్‌ కంటే చిన్నది. స్టోర్‌ ప్రారంభానికి ముందే కస్టమర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement