సాక్షి, రాజమహేంద్రవరం: ఏజెన్సీలో రెండు రోజుల పర్యటన కోసం బుధవారం జిల్లాకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పార్టీ ముఖ్యనేతలతోపాటు, శ్రేణులు, అభిమానులు అడుగడుగునా ఎదురేగి సాదరంగా తమ ప్రాంతాలలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉరకలు వేశాయి. జిల్లాలోని ముఖ్యనేతలు జగన్ వెంట ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నారు.
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరరావు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాస్, జిన్నూరి వెంకటేశ్వరరావు, సిరిపురం శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్, దాసరి శేషగిరి, రాష్ట్ర కార్యదర్శులు మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, చెల్లిబోయిన శ్రీనివాస్, మిండగుదుటి మోహన్, రావు చిన్నారావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, లింగం రవి, ఎస్‌వీవీ సత్యనారాయణ చౌదరి, అడ్డగర్ల సాయిరామ్, సుంకర చిన్ని, జిన్నూరి బాబి, దంగేటి వీరబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, అడపా శ్రీహరి, వాసిరెడ్డి జమీలు, దాసరి శేషగిరి, మురళీకృష్ణంరాజు, రాజమహేంద్రవరం ఫ్లోర్ లీడర్ మేడపాటి అనిల్ షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, విప్ మింది నాగేంద్ర, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణి, నేతలు జక్కంపూడి గణేష్ తదితరులు జగన్ వెంట ఉన్నారు.
నేడు జగన్ పర్యటన సాగేదిలా
ఏజెన్సీలో రెండో రోజు పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం రాత్రి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మారేడుమిల్లి నుంచి బయలు దేరి చింతూరు మీదుగా కూనవరం చేరుకుంటారు. రేఖపల్లిలో పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖి, అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అన్నవరంలో కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.