జగన్‌కు ఘన స్వాగతం
జగన్‌కు ఘన స్వాగతం
Published Sat, Dec 3 2016 9:35 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
గుంటూరు రూరల్ : విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి నగర వైఎస్సార్ సీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏలికా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ అంటే నేడు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా నేటికీ కనీసం మూడు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదన్నారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని.. ఎంతమందికి జాబులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 500 బైక్‌లతో ఇన్నర్ రింగ్‌రోడ్డులో భారీ ర్యాలీతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో నేతలు డి. కిశోర్, ఇంటూరి బాబ్జి, మొగిలి ప్రసాద్, విఠల్, వినోద్, రవి, వెంకట్, గురుమూర్తి, దుర్గ, మోహన్, శ్రీను, మహేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement