
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది.
చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం!