ఇరాన్‌లో తొలిసారి మహిళా సిబ్బందితో విమాన సేవలు.. | Iran First All Women Flight Crew Lands in Mashhad | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో తొలిసారి మహిళా సిబ్బందితో విమాన సేవలు

Dec 24 2024 7:28 PM | Updated on Dec 24 2024 7:54 PM

Iran First All Women Flight Crew Lands in Mashhad

టెహ్రాన్‌ : ఇరాన్‌ విమానయాన రంగంలో కలికితురాయి చోటు చేసుకుంది. డిసెంబర్‌ 22న ఇరాన్ ఎయిర్‌ లైన్‌ సంస్థ అస్మాన్ ఎయిర్‌లైన్స్‌లోని  ఇరాన్ బానూ అనే(ఇరాన్ లేడీ)విమానం మొత్తం మహిళలే సేవలందిస్తున్నారు. ఆ విమానం మషాద్‌లోని హషెమినేజాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యింది.  

ఈ విమానానికి ఇరాన్ తొలి మహిళా పైలట్ కెప్టెన్ షహ్రాజాద్ షామ్స్ నాయకత్వం వహించారు. ఇందులో మొత్తం మహిళా సిబ్బంది ఉన్నారు.  110 మంది మహిళలు ప్రయాణం చేశారు. మహిళలకు మాత్రమే సేవలందించే విమానం తొలిసారి మషాద్‌లో దిగిందని ఇరాన్‌ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రాత్మక సంఘటన ఇరాన్‌లో మదర్స్ డే సందర్భంగా జరిగింది.

స్థానిక మీడియా ఆదివారం ఉదయం విమాన రాకను ఇరాన్ మహిళలకు మైలురాయిగా అభివర్ణించింది. ఇరాన్ విమానయాన రంగంలో వారి పెరుగుతున్న పాత్రను గుర్తు చేసింది. ఈ సంఘటనతో ఇరాన్‌లో మహిళల సాధికారతకు చిహ్నంగా మారిన కెప్టెన్ షామ్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement