Stocks & Shares
-
కాసుల వర్షం కురిపించిన ఈ ఐదు షేర్లు..
-
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!
తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడికి అధికంగా లాభాలు రావాలని ఏ ఇన్వెస్టరైనా భావిస్తాడు. అయితే అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నప్పటికీ సరైన ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే, లాభాలనిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Gensol Engineering Ltd ).. గత 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్‌లలో ఒకటిగా నిలివడంతో పాటు ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టుల కోసం సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో ప్రస్తుత ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. వామ్మో.. రూ. లక్షకి 20 లక్షలు ఇటీవల జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు రూ. 1,390.65 వద్ద ముగిశాయి. అయితే అంతకుముందు షేర్ రూ.1,426.45 వద్ద ముగిసింది. క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 2.51% తగ్గింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌ని గమనిస్తే దీని ధర గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. బహుశా ఈ స్థాయిలో పెరుగుతుందని అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఊహించిఉండరేమో. ఈ షేర్ ధరపై ఓ లుక్కేస్తే.. గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా ఉండేది. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఈ స్టాక్ రూ.1,390.65కి చేరుకుంది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ₹ 21.93 లక్షల రాబడినిచ్చింది. ఇదే షేర్ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇస్తూ ఇన్వెస్టర్లకి కాసుల పంట కురిపించిందనే చెప్పాలి. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది. ఇటీవలే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), భారత ప్రభుత్వం, బ్రైత్‌వైట్ & కో. లిమిటెడ్ (BCL) సహా క్లయింట్ల నుంచి రూ. 531 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో దాదాపు 121 MWp సామర్థ్యంతో నిర్మించనున్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
స్టాక్ మార్కెట్: 3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్లు ఎగసి 17,622 వద్ద స్థిరపడింది. వెరసి ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో నిలిచాయి. ప్రారంభంలో వెనకడుగు వేసినప్పటికీ వెనువెంటనే పుంజుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య లాభపడి మార్కెట్లకు దన్నునిచ్చాయి. రియల్టీ 1 శాతం, మెటల్ 0.5 శాతం చొప్పున నీరసించాయి. బ్లూచిప్స్ తీరిలా.. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, నెస్లే, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, దివీస్, ఐటీసీ, యాక్సిస్, యూపీఎల్, ఐషర్, మారుతీ, ఇన్ఫోసిస్ 3.4–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, పవర్‌గ్రిడ్, సిప్లా, ఐసీఐసీఐ 2.4–0.8 శాతం మధ్య నష్టపోయాయి. చిన్న షేర్లు వీక్ మార్కెట్లు బలపడినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ ఇండెక్సులు 0.16 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,973 నష్టపోగా.. 1,655 లాభపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 312 కోట్లు ఇన్వెస్ట్ చేయగా దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 95 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. తాత్కాలికమే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఇకపై మార్కెట్లు ఊగిసలాటకు లోనుకావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. బుధవారం ప్రకటించనున్న సమీక్షలో ఫెడ్ 0.75% వడ్డీ రేటును పెంచే అంచనాలున్నట్లు తెలియజేశారు. స్టాక్ హైలైట్స్ ► హెర్క్యులెస్ హోయిస్ట్స్ షేరు బిజినెస్‌ల విడదీత వార్తలతో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 218 వద్ద ఫ్రీజయ్యింది. ► షుగర్, ఇంజనీరింగ్ విభాగాలుగల త్రివేణీ ఇంజనీరింగ్ షేరు 17% జంప్‌చేసి 288 వద్ద ముగిసింది. ► వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం మాడ్యులర్ ఇంటీరియర్స్‌కు రూ. 113 కోట్ల విలువైన ఆర్డర్లు లభించడంతో ఇండోనేషనల్ షేరు 20% అప్పర్ సర్క్యూట్ రూ. 404 వద్ద ముగిసింది. ► అదానీ గ్రూప్ తాజాగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడంతో అంబుజా సిమెంట్స్ 9% దూసుకెళ్లి 565 వద్ద ముగిసింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
ఇంటర్‌గ్లోబ్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే!
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొన్ని రోజులుగా సందడి చేసిన బుల్ వారాంతపు రోజైన శుక్రవారం చతికిలపడింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 652 పాయింట్లు నష్టపోయి 60వేల దిగువన 59,646 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించి 17,758 వద్ద నిలిచింది. దీంతో సెన్సెక్స్ అయిదు, నిఫ్టీ ఎనిమిది రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,111 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,633 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీలు ఒక శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.277.58 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రికవరీతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 79.44 వద్ద స్థిరపడింది. లాభాలతో మొదలై నష్టాల్లోకి: దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 823 పాయింట్లు పతనమై 60,298 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 17,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు కేంద్రం డీజిల్‌పై ఎగుమతి విండ్‌ఫాల్ లాభాల పన్నును రూ.5 నుంచి రూ.7కు పెంచడంతో రిలయన్స్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.2,614 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీల పతనానికి కారణమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, బజాబ్ ఫిన్సర్వ్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయాయి. నష్టాలు ఎందుకంటే జూన్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 18% ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరి ష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది. యూఎస్ ఫెడ్ రిజ ర్వ్ మినిట్స్, నిరుద్యోగ డేటా వెల్లడి తర్వాత కీలక వడ్డీరేట్ల పెంపు భయాలు మరో సారి తెరపైకి రావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా 13 ట్రేడింగ్ సెషన్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు గురువారం అనూహ్యంగా రూ.1,706 కోట్ల షేర్లు అమ్మేశారు. చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి వద్ద ఆ 19 స్టాక్స్.. విలువెంతో తెలుసా?
ఐకానిక్ ఫిగర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆగస్టు 14న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన లేని లోటు తీర్చలేనిదని స్టాక్ మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జీవిత భాగస్వామి అయిన రేఖా ఝున్ఘున్వాలా పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన 19 స్టాక్స్ ఉన్నాయి. వాటి విలువ రూ.9800 కోట్లుగా (సుమారు పదివేల కోట్లు). సమాచారం ప్రకారం మెట్రో బ్రాండ్లు (రూ. 3,310 కోట్లు), టైటాన్ కంపెనీ (రూ. 2,379 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ (రూ. 1,264 కోట్లు) ప్రధానంగా ఉన్నాయి. జూన్ 30, 2022 నాటికి ఆమె మెట్రో బ్రాండ్స్‌లో 14.43 శాతం, టైటాన్ కంపెనీలో 1.07 శాతం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.10 శాతం వాటా ఉంది. ఆ తర్వాత వరుసలో క్రిసిల్ (రూ. 613 కోట్లు), ఎన్సీసీ (రూ. 515 కోట్లు), ది ఇండియన్ హోటల్స్ (రూ. 393 కోట్లు), టాటా కమ్యూనికేషన్స్ (రూ. 333 కోట్లు), ది ఫెడరల్ బ్యాంక్ (రూ. 231 కోట్లు), జూబిలెంట్ ఫార్మోవా (రూ. 173 కోట్లు), వీఏ టెక్ వాబాగ్ (రూ. 125 కోట్లు), రాలిస్ ఇండియా (రూ. 117 కోట్లు) ఉన్నాయి. 1987లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో రేఖా వివాహం జరిగింది. ఆమె సెప్టెంబర్ 12, 1963న ముంబైలో జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. చదవండి: పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా! -
అమెరికా ఎఫెక్ట్.. ఆ షేర్ల జోరు అదిరింది!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో పాటు యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, మారుతీ, టాటా స్టీల్ తదితర కీలక కంపెనీల కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో మూడు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 16,642 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. విస్తృతస్థాయిలో మధ్య తరహా షేర్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం ర్యాలీ చేసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40% పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 437 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.712 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 79.91 స్థాయి వద్ద స్థిరపడింది. ఫెడ్ పాలసీ ప్రకటనకు ముందు(బుధవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. క్యూ1లో నికర లాభం 45 శాతం వృద్ధి చెందడంతో ఎల్అండ్టీ షేరు 2.5% పైగా లాభపడి రూ.1,797 వద్ద ముగసింది. ప్రతి రెండు షేర్లకు ఒక షేరు (1:2) చొప్పున బోనస్‌గా ఇచ్చేందుకు బోర్డు అనుమతినివ్వడంతో గెయిల్ షేరు రెండుశాతం లాభంతో రూ.147 వద్ద నిలిచింది. -
ఇన్వెస్టర్లకి అలర్ట్: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో.. ఓ లుక్కేద్దాం!
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాల వెల్లడి, ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ఎక్స్పైరీ ముగింపుతో పాటు కీలక కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రకటన అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘స్టాక్ సూచీలు ఈ వారం తీవ్ర ఊగసలాటకు గురికావొచ్చు. బుధ, గురువారాల్లో వెలువడనున్న ముఖ్యంగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు, రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల దిశానిర్దేశాన్ని శాసించవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే 16,800–850 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,250–16,500 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు గతవారంలో రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఐటీ, బ్యాంకింగ్, వినిమయ, మెటల్ షేర్లకు రాణించడంతో సెన్సెక్స్ 2311 పాయింట్లు, నిఫ్టీ 670 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది(2021) ఫిబ్రవరి తర్వాత సూచీలు ఒక వారంలో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. కార్పొరేట్ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ ముందుగా నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. కంపెనీల షేర్లకు నిఫ్టీ సూచీలో 30 శాతానికిపైగా వెయిటేజీ ఉంది. ఇక వారంలో నిఫ్టీ సూచీలో 18 కంపెనీలతో సహా సుమారు 400కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, శ్రీ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీఐసీ, సన్ ఫార్మా కంపెనీలు క్వార్టర్ ఫలితాలను ప్రకటించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(జూలై 26న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు (బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఫెడ్ కమిటీ గత సమీక్షలో చెప్పినట్లు 50–75 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపునకే కట్టడి ఉండొచ్చు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి అధికప్రాధాన్యతనిస్తూ ఒకశాతం పెంపునకు మొగ్గుచూపితే అది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచినట్లే అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎఫ్ఐఐల యూటర్న్ కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.ఈ జూలైలో ఇప్పటి వరకు(1–22 తేదీల్లో) రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘యూఎస్ రిటైల్ అమ్మకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల మార్కెట్లో తిరిగి కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడం, దేశీయ జూన్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడం కూడా కలిసొచ్చింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. చదవండి: ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే -
సబ్స్క్రైబర్లతో టెలిగ్రామ్ కుంభకోణం!! కేసు,సెబీ సోదాలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను వినియోగించుకుని షేర్ల ట్రేడింగ్ సంబంధ కుంభకోణానికి తెరతీశాయన్న ఆరోపణలున్న సంస్థలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ తాజగా సోదాలకు దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎనిమిది సంస్థలకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు, స్వాదీన చర్యలను చేపట్టింది. ఈ సంస్థలు తొమ్మిది టెలిగ్రామ్ చానళ్ల నిర్వహణ ద్వారా 50 లక్షలకుపైగా సబ్స్కయిబర్లకు రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా కౌంటర్లలో కృత్రిమంగా లావాదేవీల పరిమాణం, ధరల పెరుగుదలకు దారిచూపినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీటితో లింక్ చేసిన సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించాయి. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు లబ్ది పొందినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు సంబంధించి తాజాగా ఏడుగురు వ్యక్తులు, ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన పలు ప్రాంతాలలో సోదాలు, స్వాధీన చర్యలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సెబీ అధికారులు 34 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 4 డెస్క్‌టాప్‌లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. -
అమెరికా స్టాక్స్‌లో భారతీయుల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్ కంపెనీల స్టాక్స్‌లో భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎక్సేంజీలో ట్రేడింగ్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో కలిసి అన్‌స్పాన్సర్డ్ డిపాజిటరీ రిసీట్స్‌ను (యూడీఆర్) అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ వెల్లడించింది. కస్టోడియన్ హోదాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు .. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిసీట్స్‌ను జారీ చేస్తుంది. డిపాజిటరీ ఖాతాలను తెరవడంతో పాటు సంబంధిత ఇతర కార్యకలాపాలను కూడా బ్యాంకు నిర్వహిస్తుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ఎక్సేంజీలో ముందుగా అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్), ఆల్ఫాబెట్, టెస్లా, నెట్‌ఫ్లిక్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ వంటి 8 స్టాక్స్‌కి సంబంధించిన యూడీఆర్లలో ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. దీన్ని ఇతర దేశాల స్టాక్స్‌కు కూడా క్రమంగా విస్తరించనున్నట్లు ఎన్ఎస్ఈ సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు. -
నేటి వార్తల్లోని షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్: కేకేఆర్ 11,367 కోట్లు వెచ్చించి జియో ప్లాట్‌ఫాంలోని 2.31 శాతం వాటా కొనుగోలు చేసింది. క్యూ4 ఫలితాలు: ట్రెంట్,వాబ్కో ఇండియా, సుప్రీం ఇండస్ట్రీస్, బీఏఎస్ఎఫ్ ఇండియా, బేయర్ క్రాప్‌సైన్సెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు శుక్రవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. భారతీ ఎయిర్టెల్: వాయిస్జెన్ కంపెనీలో10 వాతం వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ వెల్లడించింది. ఇమామీ: ఇమామి సిమెంట్‌ను నిర్మా ప్రమోటర్ గ్రూపునకు చెందిన నువొకో విస్తాస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఎన్ఐఐటీ టెక్నాలజీస్: రూ.337.4 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించింది. లాక్డౌన్ కారణంగా ఆఫర్ లెటర్‌ను 15 రోజుల్లో పంపించడానికి సెబీ ఆమోదం తెలిపింది. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన ఎన్సీడీల జారీ ద్వారా రూ.200 కోట్లు సమీకరింనున్నట్లు ఐఆర్బీ వెల్లడించింది. ఒక్కో ఎన్సీడీ విలువ రూ.10 లక్షలని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. హాకిన్స్ కుక్కర్స్: క్యూ4లో నికర లాభం 30.56 శాతం తగ్గి రూ.9.36 కోట్లుగా నమోదైందని హాకిన్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.13.48 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. బీఎస్ఈ: నాలుగో త్రైమాసికంలో నికర నష్టం రూ.1.94 కోట్లుగా నమోదైందని బీఎస్ఈ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నికర లాభం రూ.51.86 కోట్లుగా ఉంది. హీరో మోటోకార్పొరేషన్: బహిరంగ మార్కెట్లో ఎల్ఐసీ 7.146 శాతం వాటా కొనుగోలు చేసి హీరోమోటోకార్పొరేషన్లో తన వాటాను పెంచుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్: పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఓఎన్జీసీ, ఎన్టీపీసీలు రెండు కలసిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. బజాజ్ హోల్డింగ్స్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54.36 శాతం తగ్గి రూ.361 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. -
సంక్షోభ సమయంలో పాంచ్ పటాకా సిఫార్సులు!
కరోనా సంక్షోభానికి ఒక పరిష్కారం దొరికేవరకు మార్కెట్లు స్వల్ప రేంజ్‌లోనే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటప్పుడు నిఫ్టీలో టాప్‌టెన్ స్థానాల్లో స్థిరంగా నిలుస్తూవస్తున్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. వీటిలో టాప్ 5 షేర్లను రికమండ్ చేస్తున్నారు. రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐబ్యాంక్ షేర్లపై పెట్టుబడులు బెటరని సూచిస్తున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు టీసీఎస్ 1260 శాతం, ఆర్ఐఎల్ 1250 శాతం, ఇన్ఫీ 420 శాతం, ఐటీసీ 400 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 320 శాతం మేర ర్యాలీ జరిపాయి. మార్కెట్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వేళ వీటిని నమ్మడం మంచిదని సేజ్‌వన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రతినిధి సమిత్ వర్తక్ చెప్పారు. ఇటీవల కాలంలో వరుస ఫండ్రైజింగ్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా రైట్స్ ఇష్యూకు వచ్చింది. ఈనేపథ్యంలో షేరుపై పలు బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. టీసీఎస్ తాజా త్రైమాసికంలో ఆశించిన ఫలితాలు చూపలేదు. ఇన్ఫోసిస్ సైతం ఇదే తరహాలో ఫలితాలు ప్రకటించింది. కానీ తాజా రూపీ పతనం ఈ షేర్లకు చాలా మేలు చేస్తుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఇవి నాణ్యమైన డిఫెన్సివ్ బెట్సని రెలిగేర్బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఇటీవల కాలంలో భారీ పతనం చూసింది. దీంతో షేరు వాల్యూషన్లు బాగా దిగివచ్చాయి. కంపెనీ రాబోయే రోజుల్లో మంచి వృద్ధి నమోదు చేస్తుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఇటీవలి పతనంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు బాగా క్షీణించింది. ఇది ఈ షేరులో దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా మంచి అవకాశం కల్పిస్తోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. -
కొనసాగిన డ్రీమ్ రన్
స్టాక్ మార్కెట్ల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. వెరసి వరుసగా ఆరో రోజు సెన్సెక్స్ లాభపడింది. తాజాగా 78 పాయింట్లు పురోగమించి 26,638 వద్ద ముగిసింది. తద్వారా ఆరు రోజుల్లో 324 పాయింట్లు జమ చేసుకుంది. ఇక నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి తొలిసారి 7,950కుపైన 7,954 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఒక దశలో సెన్సెక్స్ 26,674 పాయింట్ల కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 7,968కు చేరింది. కాగా, ఆగస్ట్ నెలలో సెన్సెక్స్ మొత్తం 743 పాయింట్లు లాభపడింది. ఉక్రెయిన్‌లో మళ్లీ ఆందోళనలు తలెత్తినప్పటికీ, ఆర్థిక వృద్ధికి దన్నుగా మోడీ తీసుకుంటున్న చర్యలు సెంటిమెంట్‌కు ఊతమిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు. శుక్రవారం విడుదలకానున్న తొలి క్వార్టర్ జీడీపీ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని చెప్పారు. రైల్ షేర్ల పరుగు హైస్పీడ్ రైళ్లతోసహా రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఓకే చెబుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో రైల్ షేర్లు పరుగుతీసాయ్. కెర్నెక్స్ మైక్రో, బీఈఎంఎల్, టెక్స్మాకో రైల్, స్టోన్ ఇండియా, కాళిందీ రైల్ 5% స్థాయిలో ఎగశాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్ 5% జంప్‌చేయగా, గెయిల్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, విప్రో, ఐసీఐసీఐ 2-1% మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా పవర్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ 2-1% మధ్య క్షీణించాయి. ఎఫ్ఐఐలు రూ. 711 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ ఫండ్స్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి.