రిలయన్స్ ఇండస్ట్రీస్: కేకేఆర్ 11,367 కోట్లు వెచ్చించి జియో ప్లాట్‌ఫాంలోని 2.31 శాతం వాటా కొనుగోలు చేసింది.
క్యూ4 ఫలితాలు: ట్రెంట్,వాబ్కో ఇండియా, సుప్రీం ఇండస్ట్రీస్, బీఏఎస్‌ఎఫ్ ఇండియా, బేయర్ క్రాప్‌సైన్సెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు శుక్రవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.
భారతీ ఎయిర్‌టెల్: వాయిస్‌జెన్ కంపెనీలో10 వాతం వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ వెల్లడించింది.
ఇమామీ: ఇమామి సిమెంట్‌ను నిర్మా ప్రమోటర్ గ్రూపునకు చెందిన నువొకో విస్తాస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది.
ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్: రూ.337.4 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 29 నుంచి ప్రారంభమవుతుందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా ఆఫర్ లెటర్‌ను 15 రోజుల్లో పంపించడానికి సెబీ ఆమోదం తెలిపింది.
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.200 కోట్లు సమీకరింనున్నట్లు ఐఆర్‌బీ వెల్లడించింది. ఒక్కో ఎన్‌సీడీ విలువ రూ.10 లక్షలని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
హాకిన్స్ కుక్కర్స్: క్యూ4లో నికర లాభం 30.56 శాతం తగ్గి రూ.9.36 కోట్లుగా నమోదైందని హాకిన్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.13.48 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
బీఎస్‌ఈ: నాలుగో త్రైమాసికంలో నికర నష్టం రూ.1.94 కోట్లుగా నమోదైందని బీఎస్‌ఈ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది నికర లాభం రూ.51.86 కోట్లుగా ఉంది.
హీరో మోటోకార్పొరేషన్: బహిరంగ మార్కెట్లో ఎల్‌ఐసీ 7.146 శాతం వాటా కొనుగోలు చేసి హీరోమోటోకార్పొరేషన్‌లో తన వాటాను పెంచుకుంది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్: పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీలు రెండు కలసిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
బజాజ్ హోల్డింగ్స్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54.36 శాతం తగ్గి రూ.361 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment