ఐకానిక్ ఫిగర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆగస్టు 14న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన లేని లోటు తీర్చలేనిదని స్టాక్ మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జీవిత భాగస్వామి అయిన రేఖా ఝున్‌ఘున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన 19 స్టాక్స్ ఉన్నాయి. వాటి విలువ రూ.9800 కోట్లుగా (సుమారు పదివేల కోట్లు). సమాచారం ప్రకారం మెట్రో బ్రాండ్లు (రూ. 3,310 కోట్లు), టైటాన్ కంపెనీ (రూ. 2,379 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ (రూ. 1,264 కోట్లు) ప్రధానంగా ఉన్నాయి.
జూన్ 30, 2022 నాటికి ఆమె మెట్రో బ్రాండ్స్‌లో 14.43 శాతం, టైటాన్ కంపెనీలో 1.07 శాతం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.10 శాతం వాటా ఉంది. ఆ తర్వాత వరుసలో క్రిసిల్ (రూ. 613 కోట్లు), ఎన్‌సీసీ (రూ. 515 కోట్లు), ది ఇండియన్ హోటల్స్ (రూ. 393 కోట్లు), టాటా కమ్యూనికేషన్స్ (రూ. 333 కోట్లు), ది ఫెడరల్ బ్యాంక్ (రూ. 231 కోట్లు), జూబిలెంట్ ఫార్మోవా (రూ. 173 కోట్లు), వీఏ టెక్ వాబాగ్ (రూ. 125 కోట్లు), రాలిస్ ఇండియా (రూ. 117 కోట్లు) ఉన్నాయి. 1987లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో రేఖా వివాహం జరిగింది. ఆమె సెప్టెంబర్ 12, 1963న ముంబైలో జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
చదవండి: పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!
Comments
Please login to add a commentAdd a comment