కాగజ్‌నగర్ టౌన్: ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కొడుకును అమ్ముకున్న ఘటన ఆలస్యం గా వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఎస్పీఎంలో పని చేసేవాడు. మిల్లు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయన భార్య ప్రైవేట్ ఆసుపత్రిలో నాలుగురోజుల క్రితం మగ శిశు వుకు జన్మనిచ్చింది.
ఆస్పత్రికి చెల్లించాల్సిన రూ. 13 వేలు కట్టలేక బిడ్డను విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకున్నాడు. దీనికి కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉద్యోగి మధ్యవర్తిత్వం నెరిపి నట్లు పలువురు చెబుతున్నారు. ఆ వ్యాపారి ఆస్పత్రి బిల్లుతోపాటు కొంత నగదు అందజేసి శిశువును తీసుకెళ్లినట్లు తెలిసింది.