ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ | Easy Trip Planners Acquires 13.39percent Stake In Eco Hotels And Resorts | Sakshi
Sakshi News home page

ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌

Dec 23 2023 8:01 AM | Updated on Dec 23 2023 8:01 AM

Easy Trip Planners Acquires 13.39percent Stake In Eco Hotels And Resorts - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసులందించే ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ తాజాగా ఎకో హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది.

 ఈజ్‌మైట్రిప్‌ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్‌ షేరుకి ఒక ఈజీ ట్రిప్‌ షేరుని కేటాయించనుంది.

 ఆపై ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్‌ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈజ్‌మైట్రిప్‌ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement