దక్షిణాసియా దేశమైన మాల్దీవులు 26 ద్వీపాల సమూహం. ఆ ద్వీపాల్లో ఒకదాన్ని అమ్మకానికి పెట్టింది మాల్దీవులు. దీంతో మాల్దీవులకు అతి చేరువలో ఉన్న భారత్‌కు ఇరుగుపొరుగులో మరో భద్రతా సమస్య ఏర్పడినట్లే. మాల్దీవుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం సౌదీ అరేబియాకు 'ఫాఫు' అనే ద్వీపాన్ని అమ్మాలని యోచిస్తోంది. ఈ విషయంపై మాట్లాడిన మాల్దీవుల్లోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ దేశంలో వహబిజంను దేశంలో మరింత విస్తరింపజేసే విధంగా ఉందని పేర్కొంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా ఓ పరాయి దేశానికి భూమిని అమ్మడానికి ప్రభుత్వం వెనకాడటం లేదని తెలిపింది.
Published Sat, Mar 4 2017 1:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement