శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కమింగ్ బ్యాక్
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. బ్యాటరీ పేలుళ్లతో అమ్మకాలను నిలిపివేసిన రి ఫర్‌బిష్‌డ్ గెలాక్సీ నో్ట్ 7 అమ్మకాలను మొదలుపెట్టనున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఇతర రి ఫర్‌బిష్‌డ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలతో కలిపి వీటిని కూడా విక్రయించనున్నట్టు తెలిపింది.
అయితే పునరుద్ధరించిన ఈ స్మార్ట్ఫోన్లను ఎపుడు, ఏ యే దేశాల్లో విక్రయించాలనేది ఇంకా నిర్ణయించలేదని ఒక ప్రకటనలో తెలిపింది. లోకల్ డిమాండ్, రెగ్యులేటరీ అధికారులు, విక్రయదారులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మూడు మిలియన్ యూనిట్లను విక్రయించాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొంది.
కాగా 2016 ఆగస్టులో లాంచ చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వైఫల్యం కారణంగా శాంసంగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ స్మార్ట్‌ఫోన లో అమర్చిన బ్యాటరీలు చార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయిన ఘటనలు నమోదు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు మిలియన్ల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. లిథియం అయాన్ బ్యాటరీ పేలుళ్ల కారణంగా 5.42 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.