పాలు అమ్మడానికి హెలికాప్టర్‌ కొనేశాడు | Farmer Buys Helicopter Worth Rs 30 Crore To Sell Milk | Sakshi
Sakshi News home page

వైరల్‌ : పాలు అమ్మడానికి హెలికాప్టర్‌ కొనేశాడు

Published Tue, Feb 16 2021 8:18 PM | Last Updated on Tue, Feb 16 2021 8:50 PM

Farmer Buys Helicopter Worth Rs 30 Crore To Sell Milk - Sakshi

ముంబై : పాలు అమ్మడానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆటోలు లేదా ట్రక్కులు, లేదా మోటార్‌ సైకిల్‌ మీదనో  వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని  భివాండికి చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు. ఇందుకోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం..జనార్దన్ భోయిర్ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు. దీంతో సమయం ఎక్కువగా వృధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. 

ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్‌ వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్‌ కోసం ప్రొటెక్టివ్‌ వాల్‌ను నిర్మించాడు. మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్థన్‌ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేసే జనార్థన్‌కు దాదాపు రూ 100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధురాలు తన పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ కొనుగోలు చేసేందుకు లోన్‌ ఇప్పించాలని రాష్ష్ర్టపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 


చదవండి : (వైరల్‌ : 'హెలికాప్టర్‌ కొనేందుకు లోన్‌ ఇప్పించండి')
              (అరుదైన దృశ్యం: పాముకు నీరు తాగించాడు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement