బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్‌! | Bus Driver Holding Umbrella in his Hand when bus Roof Leaked | Sakshi
Sakshi News home page

బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్‌!

Published Sun, Aug 27 2023 8:58 AM | Last Updated on Sun, Aug 27 2023 9:02 AM

Bus Driver Holding Umbrella in his Hand when bus Roof Leaked - Sakshi

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ (ఎస్‌టీ) బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ, బస్సు నడపటం కనిపిస్తుంది. బస్సు టాప్‌ నుంచి నీరు కారుతున్నదని గ్రహించి, ఆ డ్రైవర్‌ ఇలా గొడుగు పట్టుకున్నాడు. అయితే ప్రభుత్వ బస్సులో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదేమీ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి.  
 

కాగా ఈ తాజా వీడియో సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. యూజర్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో డ్రైవర్  వర్షం పడుతున్న సమయంలో గొడుగు పట్టుకుని బస్సును నడపడాన్ని గమనించవచ్చు. ఈ వీడియో మహారాష్ట్ర రవాణా  వ్యవస్థ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇలా చేయడం వల్ల డ్రైవర్‌ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement