ఓ క్రీడాకారుడు ధరించిన షూ వేలంటో కనివినీ ఎరుగుని రీతీలో ధర పలికాయి. ఆ షూతోనే ఆ క్రీడాకారుడు టైటిళ్లను గెలిచుకున్నాడు. ఆ షూలు ప్రముఖ బ్రాండ్‌వి కావడం ఒక విశేషం అయితే క్రీడాకారుడి గెలుపులో పాత్ర షోషించడం మరో స్పెషల్టీ. దీంతో అవి వేలంలో మంచి క్రేజ్ రావడంతో వేలంలో ఇంతలా ధర పలికి అందర్నీ షాక్ గురి చేసింది. ఎవరా క్రీడాకారుడు? ఏంటా బ్రాండ్ అంటే..
బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ప్రసిద్ధ బ్రాండ్‌కి చెందిన ఆరు షూల జతను ధరించి ప్రతిష్టాత్మకమైన ఆరు ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. అవి ప్రమఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండ్‌కి చెందినవి. సాధారణంగానే ఆ బ్రాండ్ షూలు అత్యంత ఖరీదైనవి. ఇక ఆ క్రీడాకారుడు విజయంలో పాత్ర పోషించిన ఆ షూలకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. తొలిసారిగా 1991లో ఎన్‌బీఏ ఫైనల్స్‌లో పోటీ పడుతున్న సమయంలో మైఖేల్‌ని పీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హాలండ్ జట్టు విజయం సాధిస్తే తాను ధరించిన ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ షూ జతను తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు.
అయితే మైకేల్ విజయం సాధించిన తదనంతరం అతడి కోరికను తీర్చాడు. ఆ షూను హాలండ్‌కు బహుమతిగా ఇచ్చే ముందుకు దానిపై సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఇలా ఐదు ఛాంపియన్‌షిప్‌లో అతడు ఆ సంప్రదాయన్ని కొనసాగించాడు. ఇలా చేస్తే గెలుస్తానని మైఖేల్ సెంటిమెంట్‌గా ఫీలయ్యాడో ఏమో గానీ అలా హాలండ్ వద్ద ఆరు జతల షూలు ఉండటం జరిగింది. ఆయన సాధించిన ఆరు చాంపియన్ షిప్‌ల్లో పాత్ర వహించిన ఆ ఆరు ఎయిర్ జోర్డాన్ షూల జతను ప్రముఖ వేలం సంస్థ సోథెబిన్ శుక్రవారం వేలం వేయగా ఆ బ్రాండ్‌కి తగ్గ రేంజ్‌లోనే రికార్డు స్థాయిలో ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ బ్రాండ్‌కి ఎప్పటికీ అత్యంత విలువైందని ఫ్రూవ్ చేసుకుందని పలువురు ప్రశంసించారు. ఇలా మైఖేల్ ధరించిన షూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇలానే ఎయిర్ జోర్డాన్ 13 షూ, అలాగే 1988లో ఎన్‌బీఏ ఛాంపియన్ గేమ్‌లో విజయాన్ని తెచ్చిన అదే బ్రాండ్‌కి చెందిన మరో రకం షూ వేలంలో రూ 18 కోట్ల ధర పలికింది. అలాగే అక్టోబర్‌లో నవంబర్ 1, 1984లో రూకీ సీజన్‌లో ఐదవ ఎన్‌బీఏ చాంఫీయన్ షిప్‌ను గెలుచుకున్నప్పుడూ ధరించిన రెడ్ అండ్ వైట్ ఎయిర్ షూ జత ఏకంగా రూ. 12 కోట్లు పలికింది. ఇప్పుడూ ఏకంగా వాటన్నింటిని తలదన్నేలా ఆ బ్రాండ్‌కి తగ్గట్లుగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 66 కోట్లు పలకడం విశేషం.
(చదవండి: అఖండ హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment