వేలానికి అమెరికా మాజీ అధ్యక్షుడి బూట్లు | Barack Obama Sneakers on Auction | Sakshi
Sakshi News home page

రూ.లక్షలు పలుకుతున్న ధర

Feb 12 2021 7:59 PM | Updated on Feb 12 2021 10:04 PM

Barack Obama Sneakers on Auction - Sakshi

ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వినియోగించిన ‘షూస్’ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర 25 వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో రూ.18 లక్షలపైనే ఉంది. తెల్లరంగులో ఉన్న ఈ బూట్లను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా తరచూ వినియోగించారు.

ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వినియోగించిన ‘షూస్’ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర 25 వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో రూ.18 లక్షలపైనే ఉంది. తెల్లరంగులో ఉన్న ఈ బూట్లను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా తరచూ వినియోగించారు. ఈ బూట్లను ప్రత్యేకంగా రూపొందించి నైకీ ఒబామాకు అందించింది. ఇవి ఒబామాకా చాలా ఇష్టమట. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉంది.

2009 నుంచి 2017 వరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే. ఒబామా రాజకీయాలతో పాటు క్రీడలు తరచూ ఆడేవారు. ముఖ్యంగా బాస్కెట్ బాల్ ఆడేవాడు. దీంతో ఆయన కోసం నైకీ 2009లో ప్రత్యేకంగా షూస్‌ని తయారు చేసి ఇచ్చింది. ఈ బూట్లను ఫ్లై వేర్ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఒబామా బయటికి వెళ్తే ఎక్కువగా ఈ షూస్‌నే వినియోగించారట. ప్రస్తుతం వేలానికి పెట్టడంతో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాలి. కొన్ని నెలల కిందట ఒబామా రాసిన  ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకం హాట్‌కేకులా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బూట్లకు కూడా అంతే డిమాండ్‌ ఉండేలా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement