Barack Obama
-
బరాక్ ఒబామాపై బీజేపీ నేతలు ఫైర్..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్బంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత దేశంలో మైనారిటీల భద్రత గురించి ప్రశ్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొదట వ్యాఖానించగా ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ కూడా ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా వ్యాఖ్యలపై మొదట స్పందించిన నిర్మలా సీతారామన్.. మీ హయాంలో మొత్తం ఆరు ముస్లిం దేశాలపైన దాడులు జరిగాయని, దాదాపుగా 26 వేలకు పైగా బాంబులు వేశారు. ఆయన మాటలను ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించే ఏకైక దేశం భారతదేశమని, ఈ విషయం ఒబామా మరచిపోకూడదని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు చేశారన్నది కూడా ఆలోచించాలని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh speaks on former US President Barack Obama's remarks about the rights of Indian Muslims "Obama ji should not forget that India is the only country which considers all the people living in the world as family members... He should also think… pic.twitter.com/k7Swn7HpW1 — ANI (@ANI) June 26, 2023 ఇది కూడా చదవండి: ప్రధానికి మణిపూర్‌లో పరిస్థితిని వివరించిన అమిత్ షా -
అబార్షన్ హక్కుల రద్దు.. కోర్టు తీర్పుపై నిరసన జ్వాలలు
వాషింగ్టన్: అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు.. అబార్షన్‌పై నిషేధం విధించేందుకు, కఠిన చట్టాలు చేసేందుకు అధికారం పొందనున్నాయి. దేశవ్యాప్తంగా అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 1973 నాటి మైలురాయి నిర్ణయం ‘రోయ్ వర్సెస్ వేడ్’ని సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ నేతలు స్పందించారు ‘‘ఇది అమెరికాకు విచారకరమైన రోజు’’ అని బైడెన్ అభివర్ణించారు. ‘‘రో వెళ్ళిపోవడంతో.. దేశంలోని మహిళల ఆరోగ్యం, జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’’ అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబాబా సైతం సుప్రీం కోర్టును తప్పుబట్టారు. ఈ తీర్పు స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారాయన. ఇవాళ సుప్రీంకోర్టు దాదాపు 50 సంవత్సరాల పూర్వాపరాలను తిప్పికొట్టడమే కాకుండా, రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తల ఇష్టానుసారంగా ఎవరైనా తీసుకోగల అత్యంత తీవ్రమైన వ్యక్తిగత నిర్ణయాన్ని - లక్షల మంది అమెరికన్ల ఆవశ్యక స్వేచ్ఛపై దాడి చేసింది అంటూ ట్విటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. భయానకంగా ఉందంటూ తీర్పుపై కామెంట్ చేశారు. గర్భస్రావానికి చట్టబద్ధమైన హక్కును కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న మిలియన్ల మంది అమెరికన్ మహిళల భయం, కోపాన్ని నేను ఊహించలేను’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రముఖులు.. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. రోయ్ 1973 ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి రెండు త్రైమాసికాల్లో అబార్షన్లకు అనుమతిస్తారు. అయితే తాజా సుప్రీం కోర్టు రద్దు నిర్ణయంతో.. సగానికి సగం పైగా రాష్ట్రాలు కఠిన అబార్షన్ చట్టం తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్పు ఇచ్చిన జస్టిస్ శ్యామ్యూయెల్ అలిటోకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇంటర్నెట్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. Abortion rights protesters stand in front of city hall in San Francisco, Calif., on Friday, June 24, 2022. People across the country took to the streets to protest after the U.S. Supreme Court overturned Roe v. Wade. #RoeVsWade #abortionrights #sanfrancisco pic.twitter.com/SRYmWuoIPf — Jose Carlos Fajardo (@jcfphotog) June 25, 2022 Today, the Supreme Court not only reversed nearly 50 years of precedent, it relegated the most intensely personal decision someone can make to the whims of politicians and ideologues—attacking the essential freedoms of millions of Americans. — Barack Obama (@BarackObama) June 24, 2022 Reversal of abortion rights #Roe vs Wade horrific indeed. — Deepa Mehta (@IamDeepaMehta) June 25, 2022 Safe #abortion is health care. It saves lives. Restricting it drives women and girls towards unsafe abortions, resulting in complications, even death. The evidence is irrefutable. https://t.co/EB5BsKIxG7 #RoeVsWade — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) June 24, 2022 -
వేలానికి అమెరికా మాజీ అధ్యక్షుడి బూట్లు
ప్రముఖ పాదరక్షల తయారీ కంపెనీ నైకీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వినియోగించిన ‘షూస్’ని వేలానికి పెట్టింది. దీని ప్రారంభ ధర 25 వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో రూ.18 లక్షలపైనే ఉంది. తెల్లరంగులో ఉన్న ఈ బూట్లను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా తరచూ వినియోగించారు. ఈ బూట్లను ప్రత్యేకంగా రూపొందించి నైకీ ఒబామాకు అందించింది. ఇవి ఒబామాకా చాలా ఇష్టమట. ఈ షూలపై ఒబామా సంతకం కూడా ఉంది. 2009 నుంచి 2017 వరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే. ఒబామా రాజకీయాలతో పాటు క్రీడలు తరచూ ఆడేవారు. ముఖ్యంగా బాస్కెట్ బాల్ ఆడేవాడు. దీంతో ఆయన కోసం నైకీ 2009లో ప్రత్యేకంగా షూస్‌ని తయారు చేసి ఇచ్చింది. ఈ బూట్లను ఫ్లై వేర్ టెక్నాలజీతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒబామా బయటికి వెళ్తే ఎక్కువగా ఈ షూస్నే వినియోగించారట. ప్రస్తుతం వేలానికి పెట్టడంతో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాలి. కొన్ని నెలల కిందట ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం హాట్‌కేకులా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బూట్లకు కూడా అంతే డిమాండ్ ఉండేలా ఉంది. Coming to Sotheby's this President’s Day Weekend! President Barack #Obama Player Exclusive Nike Hyperdunk—one of two pairs in existence —for immediate purchase this Friday at 4:44 PM EST, in celebration of America’s 44th President. #Sneakers #PresidentsDay https://t.co/s92RVU9L1m — Sotheby's (@Sothebys) February 8, 2021 -
యూఎస్: బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండన్!
వాషింగ్టన్: ఇండో-అమెరికన్, సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరా టాండన్‌ను జో బైడెన్ బడ్జెట్ చీఫ్‌గా నామినేట్ చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు మెనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నీరా హెల్త్‌కేర్ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆనాటి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఎకనమిస్ట్ సిసిలా రౌజ్‌నును ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఇక ఒబామా హయాంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన( అంతర్జాతీయ) పని చేసిన వాలీ అడెయోమోను కూడా బైడెన్ తన టీంలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. కోశాగార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జానెట్ ఎల్. యెలెన్కు వాలీని డిప్యూటీగా అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అత్యంత సన్నిహితుడు, ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు ఆర్థిక సలహాదారుగా ఉన్న జారేద్ బెర్న్‌స్టీన్ సహా హైదర్ బౌషీలకు కూడా ఆర్థిక సలహాదారుల మండలిలో స్థానం కల్పించేందుకు బైడెన్ సుముఖంగా ఉన్నారని పేర్కొంది. (చదవండి: స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్) కాగా కరోనా సంక్షోభం, నిరుద్యోగిత పెరిగిన నేపథ్యంలో అమెరికాలో 2009 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఆనాడు దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడంలో ఒబామా టీంలో ఉన్న ఆర్థికవేత్తలు కీలక పాత్ర పోషించారు. కోవిడ్-19తో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ఉద్దీపన ప్యాకేజీలు, వాక్సిన్ కొనుగోలు- పంపిణీ తదితర సవాళ్లు ముందున్న వేళ బైడెన్ సైతం మెరికల్లాంటి, ప్రతిభ గల ఎకనమిస్టులను తన టీంలోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టవచ్చనే యోచనలో బైడెన్ ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇప్పటికే విదేశాంగ విధానంపై దృష్టి సారించిన బైడెన్.. సెక్రటరీ ఆఫ్ స్టేట్- అంటోనీ బ్లింకెన్, ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్(పర్యావరణ అంశాల ప్రతినిధి)- జాన్ కెర్రీ, సెక్రటరీ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీగా అలెజాండ్రో మయోర్కస్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్- అవ్రిల్ హెయిన్స్, ఐరాసలో యూఎస్ దౌత్యవేత్త- లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివన్,చీఫ్ ఆఫ్ స్టాఫ్- రాన్ క్లెయిన్కు నియమించిన విషయం తెలిసిందే.(చదవండి: జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ) -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్‌లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్‌లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్‌ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్‌లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. -
ట్రంప్ పాలనపై విరుచుకుపడ్డ ఒబామా..
వాషింగ్టన్ : అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ.. ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ అధక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ పార్టీ అధినేత, అగ్ర రాజ్యం అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శల దాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకుంటే అమెరికన్ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ నామినేట్ అయ్యారు. బిడెన్.. ప్రస్తుత ప్రెసిడెంట్ పోరులో డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి కమలా హారిస్ నామినేషన్ స్వీకరించారు. (చరిత్ర సృష్టించిన కమలా హారిస్) ఈక్రమంలో డెమొక్రాట్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ పాలనా విధానాన్ని ఖండించారు. ట్రంప్ గెలిస్తే అమెరికా ప్రజాస్వామ్యం కూలిపోతుందని ప్రస్తుతం సాగుతున్న పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. త్రివిధ దళాల అధిపతి, అధ్యక్షుడు ట్రంప్ దేశం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమెరికన్ ప్రజాస్వామ్యానికి అస్తిత్వ ముప్పును కలిగిస్తున్నారని విమర్శించారు. శ్వేతసౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియస్‌గా చేస్తారనుకున్నాం, కానీ ఆయన పాలన నిర్లక్ష్యంగా ఉన్నట్లు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా ప్రతిష్టకు భంగం కలిగిందని, ట్రంప్ పాలనతో దేశంలోని యువత నిరాశలో ఉన్నారని ఒబామా అన్నారు. (బైడెన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన) దేశ పౌరులుగా బాద్యత వహించి ప్రజాస్వామ్యాన్ని రక్షించే నాయకున్ని ఎన్నుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. రాబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో జోసెఫ్ బైడెన్‌కు ఓటు వేయాలని ఆమె అమెరికన్లను కోరారు. బైడెన్ దేశాధ్యక్షుడు అయితే.. దేశ ప్రజలందరినీ ఆయన ఒక్కటి చేస్తారన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. ఒబామా విమర్శలను తిప్పికొట్టారు. గత ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ఉంటే ప్రస్తుతం తాను అద్యక్షుడిని అయ్యుండే వాడిని కాదని అన్నారు.కాగా ఒబామాకు, మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్‌తో వైట్హౌజ్లోపాటు వ్యక్తిగతంగా ఎనిమిది సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉంది. కాగా నవంబరు 3న జరగనున్న ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కంటే జో బిడెన్ ముందంజలో ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లలో ఆధిక్యతను చాటుకుంటున్నారు. (ట్రంప్ అంతకుమించి ఏమీ చేయలేరు!) -
చరిత్ర సృష్టించిన కమలా హారిస్
వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ స్వీకరించి కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. ప్రధాన పార్టీ డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీకి దిగిన మొదటి నల్లజాతి మహిళగా హారిస్ రికార్డులకెక్కారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా,హిల్లరీ క్లింటన్ల సమక్షంలో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా ఆమె నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శల వర్షం కురిపించారు. ట్రంప్ ప్రభుత్వం వైఫల్యం ప్రజల జీవితాలను జీవనోపాధిని నాశనం చేసిందంటూ మండి పడ్డారు. మన బాధల్ని, విషాదాలను రాజకీయ ఆయుధాలుగా మలుచుకున్న ట్రంప్ ను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మన సవాళ్లను స్వీకరించి విజయాలుగా మలిచే, మనందరినీ ఏకతాటిపైకి తెచ్చే అధ్యక్షుడిగా జో బిడెన్‌కు ఓటు వేసి గెలిపించాలని అమెరికన్లను కోరారు. తన తల్లి నేర్పిన విలువలకు, బిడెన్ విజన్ కు కట్టుబడి ఉంటానంటూ ట్వీట్ చేశారు. I am honored to accept the nomination for Vice President of the United States. I do so, committed to the values my mother taught me and to a vision that @JoeBiden shares—where all are welcome, no matter what we look like, where we come from, or who we love. #DemConvention — Kamala Harris (@KamalaHarris) August 20, 2020 అనంతరం అమెరికా తొలి నల్లజాతి అద్యక్షుడైన బరాక్ ఒబామా ప్రసంగిస్తూ బిడెన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా నవంబరు 3న జరగనున్న ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కంటే జో బిడెన్ ముందంజలో ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లలో ఆధిక్యతను చాటుకుంటున్నారు. Trump’s failure of leadership has cost lives and livelihoods. pic.twitter.com/PbGiMqKIz7 — Kamala Harris (@KamalaHarris) August 20, 2020 -
వైరల్ వీడియో : ఇది కలా.. నిజమా?!
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టమస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్టమస్ అనగానే టక్కున గుర్తుకొచ్చేవి.. క్రిస్టమస్ ట్రీ, స్టార్, శాంటా.. ఇంకా బోలెడన్ని బహుమతులు. అయితే వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించిన క్రిస్టమస్ శాంటాను చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం అవాక్కయ్యారు. తాము చూస్తున్నది కలా.. నిజమా అని పోల్చుకోవడానికి వారికి కాస్తా సమయం పట్టింది. ఎందుకంటే క్రిస్టమస్ శాంటాగా వారిని పలకరిచండానికి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కావడం విశేషం. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న చిన్నారుల్లో పండగ సరదాను తీసుకురావాలని భావించిన ఒబామా, వాషింగ్టన్లో ఉన్న చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడున్న పిల్లలను కలిసి వారితో కాసేపు ముచ్చటించి.. బోలేడన్ని బహుమతులు ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఒబామా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఈ చిన్నారులను ఎంత శ్రద్దగా చూస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యావాదాలు అన్నారు. ఒబామా, ఆస్పత్రిలో చిన్నారులతో మాట్లాడుతూ.. సందడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Thank you @BarackObama for making our patients’ day so much brighter. Your surprise warmed our hallways and put smiles on everyone’s faces! Our patients loved your company…and your gifts! https://t.co/bswxSrA4sQ ❤️ #HolidaysAtChildrens #ObamaAndKids pic.twitter.com/qii53UbSRS — Children's National 🏥 (@childrenshealth) December 19, 2018 -
పుతిన్ లౌక్యం... ఒబామాకు సంకటం
పుతిన్ అతి తెలివిగా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి మర్కెల్ సూచించిన ప్రతిపాదనలను ఆమోదించారు. దీంతో రష్యా వెనక్కు తగ్గిందని భావిస్తున్నారు. అది పొరపాటు. అమల్లోకిరాని ఒప్పందంతో పుతిన్ అమెరికాను రక్షణ స్థితిలోకి నెట్టేశారు. చదరంగం ఇద్దరు ఆడే ఆటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరచినట్టున్నారు. ఉక్రెయిన్ చదరంగపు బల్ల మీద తన ఎత్తులే గాక, ప్రత్యర్థి ఎత్తు లు కూడా తాన ఇష్టమేనని భావిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చెప్పక్కర్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ చడీ చప్పుడు లేకుండా జర్మన్ చాన్సలర్ ఏంజెలా మర్కెల్తో కలసి ఉక్రెయిన్ సంక్షోభం పై ఒక అవగాహనకు వచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు దైదియర్ బుర్ఖాల్తర్, పుతిన్‌లు ఈ నెల 7న జరిపిన చర్చల్లో ఆ ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్‌లో కీలక పాత్రధారియైన మర్కెల్ షరతులన్నిటికీ అంగీకరించి పుతిన్ వెనకడుగు వేశారని మీడియా పండితులు విశ్లేషించేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ ఆగ్నేయ రాష్ట్రాలైన డొనెత్స్క్, లుగాన్స్క్లలో రష్యా అనుకూల ‘వేర్పాటువాదులు’ మే 11న జరుప తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ బలగాలను లోతట్టుకు ఉపసంహరించడానికి సిద్ధమన్నారు. జాతీయ సయో ధ్య కోసం చర్చలు జరిపి, ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించారు. బదులుగా రష్యన్లు అత్యధికంగా ఉండే తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం, నియో ఫాసిస్టు ‘స్వాబోదా’ నేషనల్ గార్డు ముఠాలు సాగిస్తున్న ‘ఉగ్రవాద’ వ్యతిరేక సైనిక చర్యలను, అణచివేతను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌లో శాంతి, జాతీయ సయోధ్యలకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అమెరికా ఆశిస్తున్నది అది కాదు. కాబట్టే పుతిన్ వేసిన పాచిక పారింది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని రష్యా అనుకూల ఆందోళనకారులు... ఉక్రెయిన్ నియో నాజీ నేతలంటున్నట్టు ‘ఉగ్రవాదులు’కారు. పాశ్చాత్య ప్రపంచం ప్రచారం చేస్తున్నట్టు ‘వేర్పాటువాదులు’ కారు. సాధారణ కార్మికులు, ప్రజలు. కాకపోతే రష్యన్లు. అయినా వారు రష్యాలో విలీనం కావాలని కోరుకోవడం లేదు. స్వాతంత్య్రం అడగడం లేదు. ఉక్రెయిన్‌లో భాగంగానే ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే రాష్ట్రాలకు విస్తృత స్వయం ప్రతిపత్తినిచ్చే ఫెడరల్ వ్యవస్థను కోరుతున్నారు. ఆ డిమాండు కూడా చాలా పాతది. అమెరికా చేతి కీలుబొమ్మ ‘విప్లవకారులకు’ భిన్నంగా వారు పుతి న్ ఆడించేట్టు ఆడే బాపతు కాదు. కాబట్టే ‘పుతిన్ పిరికిపంద. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇందుకు బదులుగా మాస్కో రెడ్‌స్క్వేర్‌లో విప్లవంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రష్యన్ ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరు’ అని ‘డొనెత్స్క్ నేషనల్ రిపబ్లిక్’ ప్రకటించింది. పుతిన్ ఒక్క గుండు కూడా పేల్చకుండా చాలా లక్ష్యాలను సాధించారు. మర్కెల్‌ను ప్రసన్నం చేసుకుని అమెరికా-నాటో కూటమిలో విభేదాలను రగిల్చారు. అమెరికా తన సైనిక బలగాలను తూర్పు యూరప్‌కు పంపుతుండగా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సేనలను ఉపసంహరిస్తానని ప్రకటించారు. పుతిన్ శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ జాతీయోన్మాద ప్రభుత్వం అవహేళన చేసింది. పుతిన్‌కు కావాల్సిందీ అదే. అమల్లోకి రాని ఓ ఒప్పందంతో పుతిన్ అంతా సాధించారు. యథాతథంగా జాత్యహంకార మూకలు రష్యన్ల వేటను సాగిస్తాయి. మే 2న ఒడిస్సీలో 42 మంది ప్రజలను సజీవంగా దహనం చేసిన మూకలు... శుక్రవారం 20 మందిని బలిగొన్నాయి. డొనెత్స్క్, లుగాన్స్క్ ప్రజలు ఉక్రెనియన్ పాలకులను నిద్రపోనీయరని పుతిన్‌కు తెలుసు. చోద్యం చూడటమే పుతిన్ పని. అన్నిటికీ మించి విప్లవాన్ని సమర్థించిన ప్రజలు సైతం కొత్త ప్రభుత్వం పాతదేనని, కాకపోతే గ్యాస్ ధరలు 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, పన్నుల భారం తెగపెరిగిందని వాపోతున్నారు. శాంతిని కోరుతున్నారు. 1,700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం దేశాన్ని దివాలా తీయించనుంది. ఐఎంఎఫ్ రుణంలో రష్యా ఇంధన సంస్థ ‘గాజ్ప్రోమ్’కు 270 కోట్ల డాలర్లు, ఐఎంఎఫ్ పాత బకాయిల చెల్లింపులకు 500 కోట్ల డాలర్లు అయిపోతాయి. ట్యామషెంకోలాంటి అవినీతిగ్రస్త విప్లవ నేతలు తినేది తినగా ఇక మిగిలేది ఎంత? ఐఎంఎఫ్ షరతులు ఎలాంటివో చెప్పక్కర్లేదు. తూర్పు, దక్షిణ భాగాలు విడిపోతే ఈ రుణాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ బెయిలవుట్లతో గ్రీస్‌లాంటి యూరప్ దేశాలు ఎంత బాగుపడ్డాయో తెలిసినవాళ్లు ఉక్రెయిన్‌కు ఏ గతి పడుతుందో ఊహించగలరు. చిట్టచివరకు తూర్పు, దక్షిణ ప్రాంతాలే కాదు... మొత్తంగా ఉక్రెయిన్ తన కాళ్ల దగ్గరకు రాక తప్పదని పుతిన్ అంచనా. కాదనలేం. పిళ్లా వెంకటేశ్వరరావు -
సీమాంతర ఉగ్రవాదంపై ఒబామా, మన్మోహన్ చర్చలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ రోజు ఉదయం 11.30 గంటలకు వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా రక్షణ, భద్రత, వ్యాణిజ్యం,పెట్టుబడులు తదితర అంశాలపై సమీక్షించనున్నారని యూఎస్ అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఒబామా, మన్మోహన్ సమీక్ష సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడతారని వివరించింది. అలాగే ఒబామా ఇచ్చే విందులో మన్మోహన్ సింగ్ హాజరవుతారని పేర్కొంది. ఒబామాతో ఈ రోజు మన్మోహన్ సింగ్ జరుపుతున్న సమావేశం మూడోదని తెలిపింది.గతంలో 2009, 2010 సంవత్సరాల్లో వారు భేటీ అయిన విషయాన్ని ఈ సందర్బంగా వైట్‌హౌస్ గుర్తు చేసింది. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి మన్మోహన్ హాజరవుతారు. అనంతరం ఈ నెల 29న న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీ కానున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం భారత్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే.