వైరల్‌ వీడియో : ఇది కలా.. నిజమా?! | Barack Obama Turns As Santa And Surprise Visit To Hospital | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 11:40 AM | Last Updated on Thu, Dec 20 2018 11:52 AM

Barack Obama Turns As Santa And Surprise Visit To Hospital - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టమస్‌ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్టమస్‌ అనగానే టక్కున గుర్తుకొచ్చేవి.. క్రిస్టమస్‌ ట్రీ, స్టార్‌, శాంటా.. ఇంకా బోలెడన్ని బహుమతులు. అయితే వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించిన క్రిస్టమస్‌ శాంటాను చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం అవాక్కయ్యారు. తాము చూస్తున్నది కలా.. నిజమా అని పోల్చుకోవడానికి వారికి కాస్తా సమయం పట్టింది. ఎందుకంటే క్రిస్టమస్‌ శాంటాగా వారిని పలకరిచండానికి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కావడం విశేషం.

అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న చిన్నారుల్లో పండగ సరదాను తీసుకురావాలని భావించిన ఒబామా, వాషింగ్టన్‌లో ఉన్న చిల్డ్రన్స్‌ నేషనల్‌ ఆస్పత్రికి వెళ్లారు. అ‍క్కడున్న పిల్లలను కలిసి వారితో కాసేపు ముచ్చటించి.. బోలేడన్ని బహుమతులు ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఒబామా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఈ చిన్నారులను ఎంత శ్రద్దగా చూస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యావాదాలు అన్నారు. ఒబామా, ఆస్పత్రిలో చిన్నారులతో మాట్లాడుతూ.. సందడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement