వేలంలో అమ్ముడుపోయిన బ్రాడ్‌మన్ క్యాప్
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు ఇదే చివరి సిరీస్ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం.
పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది.
ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్‌తో సిరీస్ ముగిశాక బ్రాడ్‌మన్ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్ కుమార్ సేన్‌కు పంకజ్ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్ ఇప్పుడు వేలానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment