అక్షరాలా 61 లక్షలు!
బ్రాడ్‌మన్ బ్లేజర్ విలువ
సిడ్నీ: క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కు సంబంధించి ఏ వస్తువు అయినా అభిమానులకు అపురూక కానుక వంటిదే. ఉజ్వల కెరీర్‌లో ఆయన వాడిన బ్యాట్ మొదలు టోపీ వరకు అమ్మకానికి పెడితే వారు ఎగబడి కొనేందుకు సిద్ధమవుతారు.
తాజాగా 1936-37 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ వేసుకున్న బ్లేజర్‌ను సోమవారం వేలానికి ఉంచారు. డాన్ తొలిసారి ఈ సిరీస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ బ్లేజర్‌కు అనూహ్యంగా వేలంలో 1 లక్షా 32 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 61 లక్షలు) విలువ పలికింది. నిర్వాహకుల అంచనాలకు మించి ఒక వీరాభిమాని దీనిని సొంతం చేసుకున్నాడు.