జాతీయ జెండాకు అవమానం
జిల్లా సచివాలయం పైన రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరిగింది. జెండాలోని తెలుపు వర్ణం కాస్తా పసుపు మయంగా మారినా, అధికారులు గుర్తించలేదు. రంగు మారిన జెండా అంశం కాస్తా ... బుధవారం ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సమయం, సందర్భం లేకుండా రంగు వెలిసిపోయిన జెండాను కిందకు దించేసి అప్పటికప్పుడు కొత్త జెండాను తీసుకువచ్చి ఎగురవేయడం కలెక్టరేట్‌లో చర్చనీయాంశమైంది.
- డి. హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు