రంగు మారనున్న వాట్సాప్‌! త్వరలో అప్‌డేట్‌ | WhatsApp Channel Verification Check Mark Will Soon Be Updated From Green To Blue, See Details Inside | Sakshi
Sakshi News home page

రంగు మారనున్న వాట్సాప్‌! త్వరలో అప్‌డేట్‌

Published Mon, Jul 8 2024 9:41 PM | Last Updated on Tue, Jul 9 2024 12:17 PM

WhatsApp Channel Check Mark Updated From Green to Blue

వాట్సాప్‌ (WhatsApp) ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు త్వరలో ఆండ్రాయిడ్‌లో రంగు మారనున్నాయి. వాట్సాప్ ఇటీవలి బీటా వెర్షన్‌లో దీనికి సంబంధించిన మార్పును ఓ ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఇది యూజర్లందరికీ త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

వాట్సాప్‌ ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు మెటాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లైన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram), ఫేస్‌బుక్‌ (Facebook)లో ఉండే చెక్‌ మార్క్‌లను పోలి ఉండనున్నాయి. ఫీచర్ ట్రాకర్ WABetaInfo పోస్ట్‌లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌ బీటా తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసిన టెస్టర్‌లకు ఇప్పటికే కొత్త బ్లూ చెక్‌మార్క్ అందుబాటులో ఉందని పేర్కొంది .

వాట్సాప్‌లో రానున్న కొత్త కలర్ స్కీమ్ కంపెనీ యాప్‌లలో ఏకరూపతను మెరుగుపరుస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలిసిన యూజర్లకు వారు ఎంగేజ్ చేస్తున్న ఎంటిటీ ప్రామాణికమైనదో కాదో సులభంగా గుర్తించేలా చేస్తుంది.

రీడిజైన్ చేసిన వెరిఫికేషన్ టిక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్‌ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో iOSలోని టెస్టర్‌లకు కూడా అందుబాటులోకి రావచ్చు. అంతిమంగా వాట్సాప్‌ వెబ్, డెస్క్‌టాప్‌తో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌ల కోసం స్థిరమైన అప్‌డేట్ ఛానెల్‌లోకి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement