నేడు(పంద్రాగస్టు) దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష హారతి ఇవ్వడంతోపాటు మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.
ఈరోజు తెల్లవారుజామునే మహాకాళేశ్వరుని ముంగిట భస్మహారతి కూడా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భస్మహారతి అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నుంచే ఆలయం అంతటా ఆకర్షణీయమైన లైట్లను అలంకరించారు. దీంతో ఆలయం మూడు రంగుల కాంతితో వెలుగొందింది. ఆలయం పైభాగంలో జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని హిందూ పండుగలతో పాటు జాతీయ పండుగలను కూడా ఆలయంలో నిర్వహిస్తారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment