శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్‌లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!
ధర, ఆఫర్‌లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రధాన రిటైల్ స్టోర్‌లలో లభిస్తుంది.
గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సీడీ లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సీడీ పేపర్ ఫైనాన్స్‌తో కలపవచ్చు.
అప్‌గ్రేడ్ బోనస్‌ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- గేమ్ మోడ్‌లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
- స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్
- రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా
- సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా
- 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్
- 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!
Comments
Please login to add a commentAdd a comment