శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌ : బడ్జెట్‌ ధరలో | Samsung Galaxy M02 With Dual Rear Cameras | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌ : బడ్జెట్‌ ధరలో

Published Tue, Feb 2 2021 4:16 PM | Last Updated on Tue, Feb 2 2021 4:36 PM

 Samsung Galaxy M02 With Dual Rear Cameras - Sakshi

సాక్షి, ముంబై:  స్మార్ట్‌ఫోన్ ‌తయారీదారు శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను  తీసుకొచ్చింది. గెలాక్సీ ఎంఓ2 పేరుతో దీన్ని భారత​  మార్కట్లో లాంచ్‌ చేసింది.  శాంసంగ్‌ ఎం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో  తీసుకొచ్చిన ఈ  స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరా,  బిగ్‌ బ్యాటరీ,  బడ్జెట్‌ ధర ప్రత్యేకతలుగా ఉన్నాయి.

ఫిబ్రవరి 9 నుంచి  అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండనుంది.  2 జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ ధర రూ.6,999 గా ఉంచింది.  అయితే పరిచయ ధరగా 6799  రూపాయలకు అందించనుంది. బ్లాక్‌, బ్లూ, గ్రే, రెడ్‌ కలర్లలో లభ్యం.   దీంతోపాటు 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను కూడా ప్రకటించగా, ధర మాత్రం ఇంకా రివీల్‌ కాలేదు. (ఎస్‌బీఐ : యోనో బంపర్‌ ఆఫర్లు)

గెలాక్సీ ఎంఓ2  ఫీచర్లు
6.50 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 10
2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
13+2 మెగా పిక్సెల్‌  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000ఎంఏహెచ్‌ బ్యాటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement