సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరోసారి ‘శాంసంగ్ డేస్’ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం (జూన్ 9) నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ముఖ్యంగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
అలాగే, శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా లభ్యం. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్ 10 లైట్ వంటి వాటితోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. (శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్ వచ్చేశాయ్!)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎస్20ప్లస్, ఎస్ 20 కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలుపై రూ .4,000 క్యాష్‌బ్యాక్. 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్. శాంసంగ్ కేర్ + ప్లాన్‌ను రూ .2,499 అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్
రూ .4,000 వరకు క్యాష్‌బ్యాక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా గెలాక్సీ ఎస్ 10 లైట్ (128 జీబీ) కొనుగోలుపై 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్.
గెలాక్సీ ఎస్ 10 లైట్ 512 జీబీ వేరియంట్ పై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్
తక్షణ క్యాష్‌బ్యాక్ రూ .2000. రూ .2,299 ల శాంసంగ్ కేర్ + ప్యాకేజీ అదనం
Time to get a little closer to your favourite brand. Bringing to you, Samsung Days with no cost EMI and other great offers on all your favourite smartphones. Guess what? Get them delivered right at your doorstep. Happy Shopping! https://t.co/fpkWknMtpI#Samsung pic.twitter.com/KVsgZFdmjJ
— Samsung India (@SamsungIndia) June 9, 2020
ఇవి కాకుండా, గెలాక్సీ ఏ 71, ఏ 51 ఇటీవల లాంచ్ చేసిన ఏ31 పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లనుపొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లపైనా ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లపై 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ లభించనుంది. (శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్)
Comments
Please login to add a commentAdd a comment