సూపర్‌ ఫీచర్లతో శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ | Samsung Galaxy M31s India launch on July 30 | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 20 2020 3:17 PM | Last Updated on Mon, Jul 20 2020 3:27 PM

 Samsung Galaxy M31s India launch on July 30 - Sakshi

సాక్షి, ముంబై: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ ఎం31ఎస్‌ పేరుతో జూలై 30న మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆవిష‍్కరించనున్నామని శాంసంగ్‌ ప్రకటించింది.  గెలాక్సీ ఎం 31ఎస్‌ ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో లభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఎం 31  సిరీస్‌కు కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తెస్తోంది.  ఎల్-ఆకారపు డిజైన్‌లో అమర్చిన క్వాడ్‌ కెమెరా,  6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి. ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధర  20వేల రూపాయల లోపే ఉంటుందని అంచనా. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ఎస్‌ఫీచర్లు 
6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఇన్ఫినిటీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 
ఇన్-హౌస్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్
6జీబీర్యామ్‌,   64/128 జీబీ స్టోరేజ్‌
64 +8+5 +5 మెగాపిక్సెల్ క్వాడ్‌రియర్‌కెమెరా   
32 ఎంపీ సెల్ఫీ కెమెరా 
6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement