1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్‌ప్యాడ్‌పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్‌కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్‌లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్‌పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం.
ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్‌లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది.
దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్‌లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
ఎండ అధికంగా ఉన్న రోజున తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్‌లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్‌లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్‌కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
Comments
Please login to add a commentAdd a comment