హైదరాబాద్: సెక్రటేరియట్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్లో జరుగుతున్న మరమ్మతుల్లో గురువారం చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్లో రంగులు వేస్తున్న పెయింటర్ ముఖేశ్ ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సెక్రటేరియట్లోని వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముఖేశ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.