L block
-
సచివాలయం ఎల్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు. -
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
-
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతుల్లో గురువారం చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్‌లో రంగులు వేస్తున్న పెయింటర్ ముఖేశ్ ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సెక్రటేరియట్‌లోని వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముఖేశ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. -
'సీఎం కార్యాలయం మార్చాల్సిందే'
-
'సీఎం కార్యాలయం మార్చాల్సిందే'
హైదరాబాద్ : రాజకీయ నేతలు వాస్తు నమ్మకాలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. నిన్న కేసీఆర్... తాజాగా చంద్రబాబు నాయుడు వాస్తు నమ్మకాలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సచివాలయ ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. హెచ్ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీఎం కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు వాస్తు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ బ్లాక్ వాస్తుకు అనుకూలంగా లేనందున ముఖ్యమంత్రి కార్యాలయం మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఎల్ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. ఎల్ బ్లాక్‌లోని 7, 8 అంతస్తులను చంద్రబాబు కార్యాలయం కోసం కేటాయించటం జరిగింది. దీంతో ఎల్ బ్లాక్‌లో సీఎం కార్యాలయ ఏర్పాటుకు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. వాస్తు ఎఫెక్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లేందుకు విముఖత చూపారు.