
ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్‌హౌస్ ఓనర్ అత్యాచారం
గుర్గావ్: మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల మహిళపై ఓ పెయింగ్ గెస్ట్‌హౌస్ యాజమాని అత్యాచారం జరిపాడు. హర్యానా గుర్గావ్‌లోని సెక్టర్-39లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు శనివారం గుర్గావ్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఆమె గత కొన్ని నెలలుగా ఓ పెయింగ్ గెస్ట్ హౌస్ యాజమాని ఇంట్లో ఉంటోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి యాజమాని అయిన ధర్మ్‌వీర్ థాక్రాన్ తన గదిలోకి బలవంతంగా ప్రవేశించి.. తనపై అత్యాచారం జరిపాడని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని మొదట స్నేహితుల పంచుకున్న బాధితురాలు.. వారిచ్చిన ధైర్యంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తూర్పు గుర్గావ్ డీసీపీ దీపక్ సహరణ్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు.