హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీ రాజా ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో 'మా' తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 'మా' కార్యవర్గ సభ్యులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. మా కార్యదర్శిగా నరేశ్ కూడా ప్రమాణం చేశారు.