
ట్రంప్ పిక్ చేసిన మరో టాప్ ఎగ్జిక్యూటివ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ మరో ముఖ్య నియామకాన్ని చేపట్టారు. వైట్ హౌస్ లోని అతి ముఖ్యమైన ఆర్థిక-విధాన బాడీలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కు మరో టాప్ టాప్ ఎగ్జిక్యూటివ్ ని ఎంచుకున్నారు. వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ హెడ్ గా అమెరికాలోని ప్రముఖ ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ టాప్ ఎగ్జిక్యూటివ్ ని ఎంపిక చేసినట్టు శనివారం మీడియా వెల్లడించింది. గోల్డ్ మన్ అధ్యక్షుడు, గ్యారీ కోన్ (56)ను ఈ పదవికి ఎంపిక చేసుకున్నారు ట్రంప్. దీంతో ఈ సంస్థ నుంచి ట్రంప్ ఎడ్మినిస్ట్రేషన్ లో చేరనున్న మూడవ అధికారి అయ్యారు.
గోల్డ్ మన్ సీఓఓ బాధ్యతలు నిర్వహిస్తున్నగ్యారీ కోన్ ను దేశీయ అంతర్జాతీయ ఆర్థిక సమస్యల సమన్వయం చేసే కీలక ఆర్థిక మండలికి డైరెక్టర్ గా నియమించినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సెనేట్ ఆమోదం అవసరం లేని ఈ నియామకానికి కోన్ ఆమోదం లభిస్తే అతను ట్రంప్ పరిపాలనలో చేరిన మూడో బ్యాంకర్ కానున్నారు. ట్రంప్ ట్రెజరీ సెక్రటరీ నామినీ స్టీవెన్ మ్యుచిన్, వైట్ హౌస్ సలహాదారుగా స్టీవ్ బనాన్ కూడా గోల్డ్ మన్ సాచ్స్ లో పనిచేసినవారే. అయితే తన ప్రచారంలో పదే పదే గోల్డ్ మన్ లాంటి ఇతర బ్యాంకులపై విరుచుకుపడిన ట్రంప్ తాజా నియామకాలపై డెమెక్రాట్ అభ్యర్థులు బెర్నీ శాండర్స్ తదితరులు ట్విట్టర్ లో మండిపడ్డారు. ముఖ్యంగా పేదలకు దోచుకుంటోందంటూ గోల్డ్ మన్ సాచ్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1993 లో నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ ని రూపొందించారు. అనంతరం ఇదివ వైట్ హౌస్ లో అతి ముఖ్యమైన ఆర్థిక-విధాన నిర్ణయాల్లో కీలక బాడీగా మారింది.