‘జడ్జీలు సిక్సర్‌లు కొట్టాలనుకోవద్దు’ | Too much judicial interference weakens judiciary: Justice Srikrishna | Sakshi
Sakshi News home page

‘జడ్జీలు సిక్సర్‌లు కొట్టాలనుకోవద్దు’

Published Tue, Dec 6 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

‘జడ్జీలు సిక్సర్‌లు కొట్టాలనుకోవద్దు’

‘జడ్జీలు సిక్సర్‌లు కొట్టాలనుకోవద్దు’

న్యూఢిల్లీ: మితిమీరిన జోక్యం వల్లే న్యాయశాఖకు కార్యనిర్వహఖ శాఖకు మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్‌ శ్రీ కృష్ణ అన్నారు. న్యాయమూర్తులు క్రికెట్‌లోని అంపైర్‌ల మాదిరిగా ఉండాలే తప్ప బ్యాట్స్‌మెన్‌ల్లా మారకూడదని అన్నారు. ‘పార్లమెంటు-న్యాయవ్యవస్థ’  అనే అంశంపై పీఆర్‌ఎస్‌ సదస్సులో ఆయన పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు.

‘ఆయా కోర్టుల్లోని న్యాయమూర్తులు పాత్ర క్రికెట్‌ అంపైర్‌ల మాదిరిగా ఉండాలి. అంపైర్‌ నిబంధనల ప్రకారం క్రీడాకారులను, క్రీడను మాత్రమే చూడగలరు. అంతేగానీ, అతడు బ్యాట్‌ ను తీసుకొని సిక్స్‌లు కొట్టాలని చూడకూడదు. అది బ్యాట్స్‌మెన్‌ పని.. అతడు కొట్టనంత మాత్రానా బ్యాట్‌ తీసుకుని తానే కొడతానంటే కుదరదు’  అంటూ న్యాయమూర్తిని అంపైర్‌ తో పోల్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement