
హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ ఆకస్మికంగా రాజీనామా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు శుక్రవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ఆయన 90రోజుల్లో పదవిని వీడనున్నారని తెలిపింది. అయితే ఆయన స్థానంలో ఎవర్ని నియమించిందీ బ్యాంకు ఇంకా వెల్లడించలేదు.
పదవీకాలం ఇంకా మిగిలి వుండగానే ఆయన పదవినుంచి వైదొలగడం పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. 2017లో బ్యాంకు డిప్యూటీ ఎండీగా ఎన్నికైన పరేశ్ పదవీకాలం 2020, అక్టోబర్‌తో ముగియనుంది. అలాగే ఆదిత్య పూరీకి సహజమైన వారసుడిగా పరేశ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ డిప్యూటీ ఎండీ పరేశ్‌ను పునర్ నియామకానికి గారు వాటాదారుల అనుమతిని కోరనున్నట్టు ఈ ఏడాది జూన్‌లో బ్యాంకు ప్రకటించింది. ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన పలువురికి షాక్ ఇచ్చింది.