‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి.. | Woman Steals Money From Bag At Andhra Bank In Vijayawada | Sakshi
Sakshi News home page

‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..

Published Thu, Sep 30 2021 2:57 PM | Last Updated on Thu, Sep 30 2021 3:02 PM

Woman Steals Money From Bag At Andhra Bank In Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్‌లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది.

ఈ క్రమంలో బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై  గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement