
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హోసూరు(కర్ణాటక): వృద్ధురాలిని ఏ మార్చి నగలు కాజేసిన దుండగుల ఉదంతం హడ్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు– బాగలూరు రోడ్డులోని రెయిన్‌బౌ కాలనీకి చెందిన ఉషా(62) బుధవారం సాయంత్రం అదే ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు.
ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, వంటిపై నగలు భద్రపరిచి ఇస్తామని నమ్మబలికి కాగితంలో చుట్టినట్లు నటించి ఖాళీ కాగితం ఉండను అందజేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధురాలికి కాగితం ఉండలో నగలు కనిపించలేదు. దీంతో హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: కట్టుకున్న భార్య మంత్రాలు చేస్తుందనే అనుమానం.. దీంతో..
Comments
Please login to add a commentAdd a comment