
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): హోటల్లో బిరియానీ తినేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. బ్యాడరహళ్ళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఆటోడ్రైవర్ హనుమంతరాయ కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌లో బంగారు నగలు పెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిని బైక్ సైడ్ బాక్సులో పెట్టుకొని బావమరిదితో కలసి ఇంటికి వెళుతున్నాడు.
దారిలో బిరియాని హోటల్ వద్ద బైక్ ఆపి ఇద్దరూ వెళ్లి ఆరగించారు. వచ్చి చూడగా బాక్సులోని నగదు మాయమైంది. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకెళ్లినట్లు రికార్డయింది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం గాలిస్తున్నారు.