మైసూరు(బెంగళూరు): తండ్రి ఇంటికి వచ్చిన కుమార్తె ఇంట్లోని నగదు, బంగారు నగలను చోరీచేసి పరారైంది, ఈ సంఘటన మైసూరు నగరంలోని విజయనగర పరిధిలో జరిగింది. వివరాలు.. కెండగణ్ణస్వామి 7 నెలల క్రితం కూతురు శిల్పకు బంధువు రవీంద్రతో పెళ్ళి జరిపించారు. ఇష్టం లేని పెళ్ళి చేశారనే కోపంతో శిల్ప అప్పుడప్పుడు మెట్టినింటి నుంచి పుట్టించి కి వస్తుండేది.
ఏప్రిల్ నెలలో తాత పుట్టాచారి చనిపోవడంతో ఇంటికి వచ్చిన శిల్ప పునీత్ శెట్టి అనే యువకునితో వెళ్లిపోయింది. మళ్లీ ఇంటికి తిరిగివచ్చింది. ఇంతలోనే తండ్రికి చెందిన డబ్బు, బంగార నగలతో తీసుకుని అదృశ్యమైంది. కుమార్తె తన ఇంటిలో దొంగతనం చేసి పారిపోయిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దొంగతనం, మిస్సింగ్ కేసు కింద విచారణ చేపట్టారు.
చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి
Comments
Please login to add a commentAdd a comment