భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో... | Daughter Assassinated Drunken Father Karnataka | Sakshi
Sakshi News home page

భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో...

Published Mon, Mar 28 2022 2:46 PM | Last Updated on Mon, Mar 28 2022 3:14 PM

Daughter Assassinated Drunken Father Karnataka - Sakshi

మైసూరు(బెంగళూరు): జిల్లాలోని హుణసూరు తాలూకాలోని ఒకేరోజు మద్యం రక్కసి వల్ల రెండు ఘోరాలు జరిగాయి. తాగుబోతు తండ్రి కూతురు చేతిలో, తాగుబోతు కొడుకు వల్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. సీగడికట్టి గ్రామంలో దేవరాజు (50) అనే తాగుబోతు తండ్రిని కుమార్తె హతమార్చింది. మద్యానికి బానిసైన దేవరాజు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.

శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో భార్యను కొట్టసాగాడు. తల్లిని కొట్టొద్దని కూతురు సునీత తండ్రిని ఎంత వేడుకున్నా వినలేదు. తల్లిని కాపాడడానికి యత్నించి విఫలమైన సునీత ఒక కట్టెను తీసుకొని తండ్రి తలపై కొట్టడంతో తీవ్ర గాయమై అక్కడే పడిపోయాడు. ఇరుగుపొరుగు చూసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

తల్లిని చంపిన తనయుడు
బిళికెరె గ్రామంలో జయమ్మ (55) అనే మహిళను ఆమె కొడుకు హరీష్‌ (30) మద్యం మత్తులో హత్య చేశాడు. శనివారం తాగి వచ్చిన హరీష్‌ తల్లితో గొడవపడ్డాడు. ఇంటిలోని వేట కొడవలితో ఆమెను నరికిచంపాడు. బిళికెరె పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. 

చదవండి: టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement